Begin typing your search above and press return to search.
మోడీకి ఇంత చిన్న ఆలోచన తట్టలేదా?
By: Tupaki Desk | 10 Oct 2016 10:43 AM GMTఅభిమానం హద్దుల్లో ఉండక అతి చేయడం ద్వారా నాయకులను ఇరుకున పడేయడం సంగతి తెలిసిందే. అయితే సున్నితమైన విషయాల్లో కాస్త చూసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఆయా దాడులను సొమ్ము చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే సందేహం కలుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ముజ్ ఫర్ నగర్ లో వెలసిన ఈ చిత్రాన్ని పరిశీలిస్తే అవుననే అనిపిస్తున్నది.
సర్జికల్స్ స్ట్రైక్స్ విషయంలో మైలేజీ పొందేందుకు అధికార సమాజ్ వాదీ పార్టీ నాయకుడొకరు పోస్టర్ ను ఏర్పాటు చేశారు. లక్షిత దాడులకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ యూపీ మాజీ సీఎం - సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ ను సంప్రదించారట. దీంతో ములాయం తన విషయ పరిజ్ఞానంతో లక్షిత దాడులు చేయాలని మోడీ ఆదేశించారట. ఇది ఈ చిత్రం సారాశం. ఈ పోస్టర్ పై పెద్ద ఎత్తున రచ్చే జరిగింది. బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ అనే స్థాయిలో నాయకులు విమర్శలు చేసుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని తొలగించాలని అధికార సమాజ్ వాదీ పార్టీ తన నాయకులను ఆదేశించకపోవడం గమనార్హం. కాగా... ప్రధానమంత్రి మోడీ తగు నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారని తెలిసి కూడా ఈ స్థాయిలో ప్రచారం చేసుకోవడం చూస్తుంటే... ఎస్పీ నాయకులకు మోడీ ఎంత కామెడీ అయిపోయాడోనని పలువురు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/