Begin typing your search above and press return to search.
సర్ ప్రైజ్.. కొత్త జీవితం లోకి అడుగుపెట్టిన మలాలా
By: Tupaki Desk | 10 Nov 2021 7:47 AM GMTప్రపంచాని కి సర్ ప్రైజ్ ఇచ్చింది పిన్న వయసు లోనే నోబెల్ శాంతి బహుమతిని సొంతం చేసుకున్న మలాలా యూసఫ్ జాయ్. తాజాగా ఆమె వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయాన్ని తెలియ జేశారు. ఇందు లో భాగంగా ఆమె తన భర్త తో ఉన్న ఫోటోల్ని షేర్ చేశారు.గతంలోఎప్పుడూ చూడని రీతి లో.. ఆమె పెళ్లి దుస్తుల్లో సంతోషంగా కనిపించారు. భర్త చేతిని పట్టుకొని.. సంప్రదాయబద్ధంగా భర్తతో దిగిన ఫోటోను ఆమె షేర్ చేశారు. ఇప్పటికి తాలిబన్ల తూటాలకు తీవ్రంగా గాయపడిన చిన్నారిగానే గుర్తున్న ఆమె.. అప్పుడే పెళ్లీడుకు వచ్చేసి.. పెళ్లి చేసుకుందా? అన్నట్లు ఉంది. 24 ఏళ్ల మలాలా తన జీవిత భాగస్వామి అస్సర్ ను ప్రపంచానికి పరిచయం చేశారు.
తన పై తాలిబన్లు దాడి చేశాక మెరుగైన వైద్యం కోసం లండన్ వచ్చిన ఆమెకు అనేక శస్త్ర చికిత్సలు జరగటం.. చివరకు లండన్ లోనే వారి కుటుంబం స్థిరపడటం తెలిసిందే. బర్మింగ్ హమ్ లోని తన ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించామని.. మీ ఆశీస్సులు తమకు పంపాలని ఆమె కోరారు. ‘భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించటానికి సంతోషంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. అయితే.. తన భర్తకు సంబంధించిన వివరాల్ని ఆమె షేర్ చేయలేదు.
పాక్ లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా.. 2012లో తాలిన్లు ఆమె చదువుతున్న స్కూల్లో జొరబడి ఆమెపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆమె ఎడమ కణితిపైనా.. శరీరంపైనా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెపై జరిగిన దాడి ప్రపంచ వ్యాప్తంగా ఖండనలు వెల్లువెత్తటంతో పాటు.. ఆమె కోలుకోవాలని ప్రపంచంలోని పలు దేశాల్లోని వారు ఆకాంక్షించారు. వారి ప్రార్థనలు ఆమె ను బతికేలా చేశాయి. అప్పటి నుంచి బాలికల పాఠశాల విద్య కోసం ఉద్యమించటం షురూ చేశారు. 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 17 ఏళ్ల పిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతిని సొంతం చేసుకున్న మలాలా చరిత్రను క్రియేట్ చేశారు.
2020లో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ నుంచి ఫిలాసఫీ.. పాలిటిక్స్.. ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకున్న ఆమె.. బాలికల విద్య కోసం మలాలా ఫండ్ పేరుతో చారిటీ సంస్థను నెలకొల్పి .. సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. కొద్ది నెలల క్రితం పెళ్లి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి.. పెద్ద ఎత్తున చర్చ సాగింది. ప్రముఖ బ్రిటీష్ మ్యాగ్ జైన్ ‘వోగ్’ తన జులై ఎడిషన్ ముఖ చిత్రం కోసం మలాలాను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రాజకీయాలు.. సంస్కృతితో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాల్ని పంచుకుంది.
ఈ క్రమంలో పెళ్లి గురించి ఆమె వెల్లడించిన విషయాలు సంచలనంగా మారి.. ఆమె వ్యాఖ్యల్ని పలువురు ఖండించటం గమనార్హం. తన తల్లిదండ్రులు తనను పెళ్లి కుమార్తెగా చూడాలని ఆశ పడుతున్నారని.. అలానే చాలామంది తమ సంబంధాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘వీటన్నింటిని చూస్తే నాకు చాలా ఆందోళన కలుగుతుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మన జీవితంలో ఒక భాగస్వామి, తోడు కావాలంటే.. పెళ్లి పత్రాలపై ఎందుకు సంతకాలు చేయాలి.. కేవలం భాగస్వాములుగా ఎందుకు ఉండలేరు’’ అన్న ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఖండనలు రావటం.. ఆమె తీరును తీవ్రంగా తప్ప పడుతూ కొందరు నెటిజన్లు బాహాటంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెళ్లిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన మలాలా.. అందుకు విరుద్ధంగా సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవటం గమనార్హం. మొత్తంగా తన పెళ్లితో ప్రపంచానికి సర్ ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి.