Begin typing your search above and press return to search.

ఉపాధ్యాయ‌ల‌పై నిఘా నేత్రం..

By:  Tupaki Desk   |   10 Feb 2022 10:30 AM GMT
ఉపాధ్యాయ‌ల‌పై నిఘా నేత్రం..
X
మెరుగైన పీఆర్సీ, ఇతర డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెం చింది. ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఉపాధ్యాయ సం ఘాల నాయ‌కులపై పోలీసులు నిఘాను క‌ట్టుదిట్టం చేశారు. వారు ఎక్క‌డికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అని పోలీసులు నిఘా పెంచారు. విజ‌య‌వాడ‌లో అయితే..ఏకంగా.. ఉద్యోగ సంఘాల నాయ‌కుల వెనుకాలే పోలీసులు చుట్టుముట్టారు. వారు ఎక్క‌డికి వెళ్తున్నా..ఫాలో అయ్యారు. ఏం చేస్తున్నారు? ఎక్క‌డ‌కు వెళ్తు న్నారు? అంటూ.. ప్ర‌శ్న‌లు గుప్పించారు.

ఇక‌, ఉపాధ్యాయులు ఈ నెల 12న రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో తీసుకునే నిర్ణ‌యం మేరకు ప్ర‌భుత్వంపై ఉద్య‌మించేందుకు రెడీ అవుతున్నారు. ఫిట్‌మెంట్ పెంపు.. పీఆర్సీ మార్పు, సీపీఎస్ ర‌ద్దు వంటి కీల‌క‌మైన అంశాల‌పై వారు.. ఉద్య‌మించ‌నున్నారు.. ఈ నేప‌థ్యంలో ఈ స‌మావేశం ఆదిలోనే.. ఉద్య‌మాన్ని నీరు గార్చేందుకు ప్ర‌భుత్వం పోలీసుల‌ను ప్ర‌యోగిస్తోంద‌ని అంటున్నారు ఉపాధ్యాయులు. ఈ నేప‌థ్యంలో ఉపాధ్యాయులను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. ఏపీ ఎన్జీవో ఆఫీస్‌కు పోలీసులు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించారు. ఉపాధ్యాయ సంఘాలు వ‌చ్చి.. ఈ కార్యాల‌యంపై దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని భావించి.. తాము భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే.. ఉద్య‌మాన్ని నీరు గార్చే ప్ర‌య‌త్నంలో భాగంగా.. మరోవైపు ఉపాధ్యాయులు పాఠ శాలల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధం గా ఆందోళనలు చేస్తే సీసీయే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరికలు పంపింది.

పలు ప్రాంతాల్లో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయకపోవ డంతో సెల్‌తో అటెండెన్స్‌ను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాలని కోరింది. తమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న.. తమను దూషిస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని స్టీరింగ్ కమిటీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళనబాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం కత్తి దూసింది. నల్ల బ్యాడ్జీలతో పలు పాఠశాలల్లో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులపై పోలీసులు నిఘా విధించారు. మ‌రి ఈ ప‌రిస్థితి ఎటు దారితీస్తుందో చూడాలి.