Begin typing your search above and press return to search.

‘మతిమరుపు’ కరోనా కొత్త లక్షణమిది..! జర పైలం..!

By:  Tupaki Desk   |   3 Dec 2020 3:30 AM GMT
‘మతిమరుపు’ కరోనా కొత్త లక్షణమిది..! జర పైలం..!
X
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ప్రజల్లోనూ మునుపటి భయం లేదు. మాస్కులు పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం లాంటి విషయాలను ప్రజలు మర్చిపోయారు కూడా. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో సెకండ్​ వేవ్​ ముంచుకొస్తోంది . లాక్​డౌన్​ కూడా విధిస్తున్నారు. మనదేశంలోనూ ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కాగా కరోనాకు సంబంధించి మరో కొత్త లక్షణాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, శ్వాసలో ఇబ్బందులు లాంటివే కరోనా లక్షణాలు ఉన్నాయి. వీటితో పాటు వాసనకోల్పోవడం కూడా కరోనా లక్షణంగా నిర్ధారించారు.

చాలా మందిలో ఏ లక్షణాలు లేకుండా కూడా కరోనా వచ్చింది. వాళ్లకు తొందరగా వ్యాధి నయమైంది. కొందరికేమో కరోనా వచ్చినట్టు పోయినట్టు కూడా తెలియలేదు. అయితే శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం .. మతిమరుపు కూడా కరోనా లక్షణమే. బార్సిలోనా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన సర్వేలో ఈ విషయం తేలింది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, సుదీర్ఘకాలం ఒక పనిపై దృష్టి పెట్టలేకపోవడం వంటివి కూడా కరోనా లక్షణాలేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అయితే కరోనా నయం అయ్యాక కూడా కొంతమందిని అనారోగ్యం వేధిస్తున్నది. చాలామందిలో కరోనా తగ్గిపోయాక కూడా తరచూ జ్వరం వస్తోంది. అంతేకాక శ్వాససంబంధిత వ్యాధులు, డిప్రెషన్​ లాంటి మానసిక వ్యాధులు వస్తున్నాయి. అయితే వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరుతున్నారు. రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలని అంటున్నారు.