Begin typing your search above and press return to search.
టీడీపీలో సర్వే.. ఏం జరుగుతుంది...?
By: Tupaki Desk | 13 Dec 2021 2:30 AM GMTటీడీపీ సంస్కరణ బాట పట్టింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ అన్ని రూపాల్లోనూ.. ప్రయ త్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు పార్టీని లైన్‌లో పెట్టేందుకు చర్యలు తీసుకుం టున్నారు. ముఖ్యంగా పార్టీలో ప్రతి ఒక్కరినీ ఉత్తేజం పరిచేందుకు చంద్రబాబు ప్రయత్ని స్తున్నారు. అయి తే.. తాజాగా నేతల పనితీరును తెలుసుకునేందుకు టీడీపీలో సర్వే ప్రారంభమైంది. ఎందుకంటే.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ.. దీనికి ముందు జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసిన చంద్రబాబు.. నేతల పనితీరు కారణంగానే గెలుపు దక్కలేదని గ్రహించారు. ఈ క్రమంలోనే వరుస పెట్టి నేతలను పిలిచి.. వార్నింగులు ఇస్తున్నారు. కొందరిని సస్పెండ్ చేస్తున్నారు. అయితే.. అక్కడితో ఆగని చంద్రబాబు.. ఇప్పడు నియోజకవర్గాల్లో సర్వే చేపడుతున్నారు. నేతలపై ఆ పార్టీ స్థానిక కేడర్ ఏమనుకుంటోంది ? కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు చేదోడుగా ఉంటున్నారా. లేదా ? ప్రభుత్వ వ్యతి రేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? లేదా? పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కార్యక్రమాలు సీరియస్‌గా చేస్తున్నారా ? మొక్కు బడిగా ముగిస్తున్నారా..? పార్టీలో అందర్నీ ఏకతాటిపై తీసుకుని, పనిచేస్తున్నారా..? గ్రూపులను ప్రోత్సహిస్తున్నారా...?ఇల పలు అంశాలను చంద్రబాబు పరిశీలన చేయిస్తున్నారు.
అదేసమయంలో.. కార్యకర్తలను అయోమయానికి లోనుచేసేలా ఎవరికి వారు వ్యవహరిస్తున్నారా..? నియో జకవర్గాల్లో ద్వితీయ శ్రేణిలో పట్టున్న నాయకులను ఎదగనీయకుండా దూరం పెట్టేలా వ్యవహరిస్తున్నా రా..? వంటి అంశాలపై ఆ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మేధావివర్గాలను కలుస్తూ... అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే తరహా పరిస్థితి చోటు చేసుకుందని.. చంద్రబాబుకు ఉప్పందింది. ఈ క్రమంలోనే ఇక్కడి ముగ్గురు కీలక నేతలపై వేటు వేశారు. ఇక, ఇప్పుడు సర్వేలో వచ్చిన ఫలితం ఆధారంగా మరింత మందిని పక్కన పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు.. ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఖరారు విషయంలో ఇబ్బంది లేకుండా.. ముందస్తుగా ఏ నియోజకవర్గంలో ఎవరు బలమైన అభ్యర్థి కాగలరు, అధికార పార్టీ దౌర్జన్యాలకు అన్నివిధాలుగా ఎదురొడ్డి నిలిచే పట్టున్న నాయకుడు ఎవరైతే బాగుంటారనే కోణంలోనూ సర్వే చేస్తున్నట్టు సమాచారం. అంటే.. మొత్తంగా టీడీపీలో ఇప్పుడు చేస్తు్న్న సర్వే.. అన్ని కోణాల్లోనూ పార్టీకి మేలు చేసేదని సీనియర్లు చెబుతున్నారు. కానీ, అదే సమయంలో ఉన్న వారిని పక్కన పెడితే.. ఎలా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. తప్పులు చేయనివారు ఎవరు? ఉన్నవారిని తప్పుల పేరుతో పక్కన పెడితే కష్టమేనని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.