Begin typing your search above and press return to search.

గూగుల్ మ్యాప్స్ లో అది లేదట‌

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:54 PM GMT
గూగుల్ మ్యాప్స్ లో అది లేదట‌
X
ఏది ఎక్క‌డున్న‌దో తెలుసుకునేందుకు ఈ రోజు కోట్లాదిమంది వినియోగిస్తున్న‌ది గూగుల్ మ్యాప్‌నే. సగ‌టు జీవి మాత్ర‌మే కాదు చివ‌ర‌కు ఊబ‌ర్‌.. ఓలా లాంటి ర‌వాణా సంస్థ‌లు స‌హా.. ప‌లు కంపెనీలు గూగుల్ మ్యాప్ మీదే ఆధార‌ప‌డుతున్నాయి. ఇలాంటి వేళ‌.. స‌ర్వే ఆఫ్ ఇండియా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేసింది. గూగుల్ మ్యాప్స్ లో క‌చ్ఛిత‌త్వం మీద సందేహాలు వ్య‌క్తం చేసింది. గూగుల్ మ్యాప్ లు ప్రామాణికం కాద‌ని పేర్కొంది.

గూగుల్ మ్యాప్ ల‌ను ప్ర‌భుత్వం ప్రామాణికంగా రూపొందించ‌లేదు కాబ‌ట్టి.. వాటిని విశ్వ‌సించ‌వ‌ద్దంటూ సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగానికి చెందిన స‌ర్వే ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది.

గూగుల్ మ్యాప్స్ కు బదులుగా స‌ర్వేఆఫ్ ఇండియా మ్యాప్స్ ఉప‌యోగించాల‌ని చెబుతున్నారు ఆ సంస్థకు చెందిన స్వ‌ర్ణ సుబ్బారావు. గూగుల్ మ్యాప్స్ ను చూసి మోస‌పోవ‌ద్ద‌ని ఆయ‌న వార్నింగ్ ఇస్తున్నారు. స‌ర్వే ఆఫ్ ఇండియా 250 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మాట్లాడుతూ.. గూగుల్ మ్యాప్స్ ను రెస్టారెంట్లు.. పార్కులు వెతికే చిన్న కార్య‌క్ర‌మాల కోసం మాత్ర‌మే వాడుతున్న‌ట్లుగా చెప్పారు. ముఖ్య‌మైన మౌలిక‌స‌దుపాయాల కోసం.. కీల‌క ప్రాజెక్టుల కోసం త‌మ మ్యాప్స్ నే వాడుతున్న‌ట్లుగా చెప్పారు.

ఒక‌వేళ అదే నిజ‌మైతే.. ప‌లు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి అధికారికంగా ద‌ర‌ఖాస్తు పెట్టుకునే వారిని గూగుల్ మ్యాప్ లు జ‌త చేయాల‌ని ప‌లు ప్ర‌భుత్వ సంస్థ‌లు చెప్ప‌టం ఏమిట‌న్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న‌. స‌ర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లు అంత ప్రామాణికం అయితే.. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎందుకు ప్ర‌చారం నిర్వ‌హించ‌లేద‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఇదిలా ఉంటే.. స‌ర్వే ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్య‌లు త‌ప్ప‌ని పార్ట్‌మెంట్‌ ఆఫ్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్యదర్శి అశుతోష్ శర్మ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/