Begin typing your search above and press return to search.
సర్వే రిపోర్ట్: ఎంపీ ఎన్నికల్లోనూ కారుకు ఎదురేలేదు!
By: Tupaki Desk | 25 Jan 2019 4:43 AM GMTమరో మూడు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి? ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మాదిరే గులాబీ కారు దూసుకెళుతుందా? లాంటి ప్రశ్నలకు ప్రముఖ న్యూస్ ఛానళ్లలో ఒకటైన రిపబ్లిక్ టీవీ తన సర్వే వివిరాల్ని వెల్లడించింది.
రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ నిర్వహించిన సర్వే ఫలితాల్ని గురువారం రాత్రి వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికల్ని నిర్వహిస్తే తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఏకంగా 16 స్థానాల్ని సొంతం చేసుకుంటుందని వెల్లడించింది. హైదరాబాద్ ఒక్క స్థానాన్ని మాత్రం మజ్లిస్ సొంతం చేసుకోనుంది. మిగిలిన పార్టీలకు ఒక్కటంటే ఒక్క సీటు లభించే అవకాశం లేదని తేల్చింది.
నేషనల్ అఫ్రూవల్ రేటింగ్స్ పేరుతో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.. బీజేపీ.. టీడీపీతో సహా మరే పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొంది. ఓట్ల శాతానికి వస్తే టీఆర్ఎస్ 42.4 శాతం.. కాంగ్రెస్ 29 శాతం.. బీజేపీ 12.7 శాతం.. మజ్లిస్ 7.7 శాతం.. ఇతరులు 8.2 శాతం ఓట్లను సొంతం చేసుకుంటుందని తన సర్వే ఫలితాల్ని వెల్లడించింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన సర్వేలో టీఆర్ ఎస్ 9 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పగా.. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ కారుకు స్పీడ్ ను అడ్డుకునే వారేలేరని స్పష్టం చేసింది.
2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ 11 స్థానాల్లో.. కాంగ్రెస్ రెండు స్థానాల్ని సొంతం చేసుకోగా.. బీజేపీ.. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీలు ఒక్కొక్క స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా టీఆర్ ఎస్ ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్ని తన ఖాతాలో వేసుకోనున్నట్లుగా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.