Begin typing your search above and press return to search.

లేటెస్ట్ స‌ర్వే రిపోర్ట్‌.. ఏపీలో జ‌గ‌న్‌ కు ఎదురే లేదు!

By:  Tupaki Desk   |   25 Jan 2019 4:41 AM GMT
లేటెస్ట్ స‌ర్వే రిపోర్ట్‌.. ఏపీలో జ‌గ‌న్‌ కు ఎదురే లేదు!
X
సుదీర్ఘంగా సాగిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఏపీ విప‌క్ష నేత ఎక్క‌డికి వెళ్లినా జ‌నం విర‌గ‌బ‌డిన ప‌రిస్థితి. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కున్న అభిమానం ఎంత‌న్న విష‌యం పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన స్పంద‌న చెప్పేసింది. తాజాగా.. ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ రిప‌బ్లిక్ టీవీ- సీ ఓట‌ర్ సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో జ‌గ‌న్ పార్టీకి ఏపీ ఓట‌ర్లు ఎన్ని ఎంపీసీట్లు క‌ట్ట‌బెడ‌తార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

త్వ‌ర‌లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక సీట్ల‌లో గెలిచి ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని పేర్కొంది. తాము చేప‌ట్టిన లేటెస్ట్ స‌ర్వే ఫ‌లితాల్ని స‌ద‌రు ఛాన‌ల్ వెల్ల‌డించింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీకి ఆరు ఎంపీ స్థానాల్ని మాత్ర‌మే చేజిక్కించుకుంటార‌ని.. అదే స‌మ‌యంలో విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మాత్రం ఏకంగా 19 ఎంపీ సీట్ల‌ను సొంతం చేసుకుంటుంద‌ని పేర్కొంది.

నేష‌న‌ల్ అఫ్రూవ‌ల్ రేటింగ్స్ పేరుతో జ‌రిగిన ఈ స‌ర్వే ఫ‌లితాల్ని రిప‌బ్లిక్ టీవీ గురువారం రాత్రి విడుద‌ల చేసింది. జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఏపీలో ఒక్క‌టంటే ఒక్క ఎంపీ స్థానం ద‌క్క‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఎంపీ సీట్ల విష‌యంలోనే కాదు.. ఓట్ల శాతం ప‌రంగా చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ ది పైచేయిగా నిలుస్తున్న‌ట్లు త‌మ స‌ర్వే ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని వెల్ల‌డించింది. జ‌గ‌న్ పార్టీకి 41.3 శాతం ఓట్లు ల‌భిస్తాయ‌ని.. అదే స‌మ‌యంలో అధికార టీడీపీకి 33.1 శాతం ఓట్లు ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ.. జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి పోటీ చేసిన టీడీపీ.. అప్ప‌ట్లో 15 మంది ఎంపీల‌ను మాత్రమే సొంతం చేసుకోగ‌లిగింది. అదే స‌మ‌యంలో బీజేపీ రెండు స్థానాల్లో విజ‌యం సాధించారు. ఇక‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. తాజాగా.. నిర్వ‌హించిన స‌ర్వేలో జ‌గ‌న్ పార్టీ ఒక్క‌టే ఎలాంటి పొత్తులు లేకుండా ఘ‌న విజ‌యాన్నిసాధించే అవ‌కాశం ఉన్న‌ట్లుగా అంచ‌నా వేసింది. రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే ఫ‌లితాలు ఏపీ అధికార‌ప‌క్షంలో క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి.