Begin typing your search above and press return to search.
ముంబైలో పిల్లలపై సర్వే.. షాకింగ్ ఫలితాలు, కరోనా ఎంతమందికి సోకిందంటే ?
By: Tupaki Desk | 29 Jun 2021 10:30 AM GMTకరోనా వైరస్ .. ఏ క్షణంలో వెలుగులోకి వచ్చిందో కానీ, ఆ క్షణం నుండి మనల్ని వెలుగులోకి రానివ్వకుండా చేస్తుంది. మొదటి వేవ్ , సెకండ్ వేవ్ ఇప్పుడు కొత్తగా థర్డ్ వేవ్ కూడా రాబోతుందట. సెకండ్ వేవ్ తో కరోనా ఖతం అనుకుంటే మూడో వేవ్ అని మళ్లీ ఆందోళనకి గురిచేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ... ఈ థర్డ్ వేవ్ లో ఎక్కువగా పిల్లలే కరోనా భారిన పడతారని , వారు తట్టుకోలేరని నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై లో చేసిన ఓ సర్వే ఇప్పుడు కొంచెం రిలాక్స్ ను ఇస్తుంది. ముంబైలోని పిల్లల్లో 51.18 శాతం మంది కరోనా యాంటీబాడీలను కలిగి ఉన్నట్టు తేల్చింది. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ముంబైకు చెందిన బీవైఎల్ నాయర్ హాస్పిటల్, కస్తూర్బా ల్యాబ్ ఈ సెరో సర్వే నిర్వహించింది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరిగిన ఈ సర్వేలో 2179మంది చిన్నారులనుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 51.18శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే ..వీరికి ఇప్పటికే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నవారే. అయితే వీరిలో ఎవరికీ స్వల్ప లక్షణాలు కూడా లేవని తల్లిదండ్రులు చెప్పడం విశేషం. అంటే దాదాపుగా సెకండ్ వేవ్ సమయంలోనే చిన్నారులకు కరోనా వచ్చి తెలియకుండానే తగ్గిపోయింది. ముంబైలోని 24 వార్డుల్లో మే, జూన్ నెలల్లో 6 నుంచి 18 ఏళ్ల వయసున్న వారి నమూనాలను ఈ సర్వే కోసం సేకరించారు.ఈ సర్వే ఆధారంగా దాదాపు 50 శాతం మంది పిల్లలు కరోనా బారిన పడి కోలుకున్నట్టు తేలింది. 10 నుంచి 14 ఏళ్ల వయసున్న వాళ్లు సుమారుగా 53.43 శాతం కరోనా బారిన పడినట్టు సెరో సర్వేలో వెల్లడైంది.
1 నుంచి 4 ఏళ్ల వయసున్న వాళ్లు 51.04 శాతం మంది, 5 నుంచి 9 ఏళ్ల వయసున్న వాళ్లు 47,33 శాతం మంది, 10 నుంచి 14 ఏళ్ల వయసున్న వాళ్లు 53.43 శాతం మంది, 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వాళ్లు 51.39 శాతం మంది కరోనా బారిన పడ్డారు. మొత్తంగా 1 నుంచి 18 ఏళ్ల వయసున్న వాళ్లు 51.18 శాతం మంది కరోనా బారిన పడ్డారు. మార్చి 2021తో పోలిస్తే ఈసారి నిర్వహించిన సెరో సర్వేలో పిల్లల్లో ఎక్కువ పాజిటివిటీ రేటు కనిపించిందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. ఈ సర్వేను బట్టి కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చనని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు , అలాగే పిల్లలపై సెకండ్ వేవ్ ప్రభావం చూపినా పెద్దగా నష్టం జరగలేదనే విషయం దీనితో తేటతెల్లం అయ్యింది.