Begin typing your search above and press return to search.
లక్షణాలు లేకున్నా కరోనా ఉన్నట్టు..భారత్ లో అలాంటి కేసులెన్నో..!
By: Tupaki Desk | 18 April 2020 12:30 AM GMTప్రస్తుతం ప్రపంచం కరోనా ముందు చిన్నబోయింది. ఏకంగా ఆ వైరస్ ధాటికి ప్రపంచ గజగజ వణికిపోతుంది. ఇప్పటి వరకు 22 లక్షల మంది వైరస్ బారిన పడగా దాదాపు 1.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే ఆ వైరస్ ఎంతగా ప్రబలుతుందో అర్థమవుతూనే ఉంది. ఆ వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలన్నీ విస్తృతంగా సాగుతున్నాయి. ఆ వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు ఆ వైరస్ గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు కూడా పరిశోధనలు చేస్తున్నారు. వైరస్‌పై అనేక సంస్థలు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఒక్కో పరిశోధన ఒక్కో విషయాన్ని వెల్లడిస్తూ ఆ వైరస్‌పై మానవ పరిశోధనలు పురోగతి సాధిస్తున్నాయి. కానీ ఆ వైరస్‌కు విరుగుడు మాత్రం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. అయితే ఈ క్రమంలో వైరస్‌కి సంబంధించి శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనం అందరిలో భయోత్పాతం సృష్టిస్తోంది.
ఈ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఆ లక్షణాలు ఉన్న వారి నుంచే వ్యాపిస్తోందని భావిస్తున్నాం. కానీ చైనాలో జరిగిన కొన్ని పరిశోధనల్లో నిత్య సత్యం ఒకటి తేలింది. కరోనా లక్షణాలు కనిపించని వారిలో కూడా ఆ వైరస్ విస్తరించి ఉంటుందని, వారి నుంచి కూడా ఇతరులకు వేగంగా అంటుకుంటోందని ఆ అధ్యయనంలో తేలింది. అలాంటి కేసులు భారతదేశంలో చాలా నమోదయ్యాయి. కరోనా లేని వ్యక్తి నుంచి మరొక ఆరోగ్యవంతమైన వ్యక్తికి సోకిన రెండు మూడు రోజుల తర్వాత కాని ఆ వైరస్ లక్షణాలు బయటపడకపోవడం ప్రస్తుతం ఆందోళనకు గురి చేసే అంశం.
ఈ విషయాన్ని నేచర్ మెడిసిన్ జర్నల్ ఈ నెల 15వ తేదీన వెల్లడించింది. చైనాలోని గాంగ్‌ఝౌ ఆస్పత్రిలో చేరిన కొందరు కరోనా బాధితులను పరీక్షించిన అనంతరం ఇది వాస్తవమేనని గుర్తించారు. గాంగ్‌ఝౌ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో పాటు హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంలోని సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షివస్ డిసీజ్ ఎపిడిమియోలజీ అండ్ కంట్రోల్ సైంటిస్టులు కలిసి అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా భారత్‌లో ఇప్పటివరకూ కరోనా సోకిన వారిని కూడా పరీక్షిస్తున్నారు. వీరిలో ట్రావెల్ హిస్టరీని కనుగొనేందుకే ఇవి ఉపయోగపడుతున్నాయి.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ మధ్య జరిపిన ర్యాండమ్ పరీక్షల్లో 104 టెస్ట్‌లు పాజిటివ్‌గా తేలాయని భారత మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. వీటిలో 40 కేసుల్లో ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని తేలినా, వారికి ఎలా వ్యాప్తి చెందిందో తెలియడం లేదు. దీంతో ప్రస్తుత పరిశోధనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.