Begin typing your search above and press return to search.

సర్వే చెబుతున్న మోడీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమంటే..

By:  Tupaki Desk   |   25 May 2016 4:44 AM GMT
సర్వే చెబుతున్న మోడీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమంటే..
X
మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అయిన నేపథ్యంలో ఒక సర్వే నిర్వహించారట. 15వేల మంది దేశ పౌరుల మీద జరిపిన సర్వేలో మోడీపాలన మీద జాతి జనులు ఏమనుకుంటున్నారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. దేశంలోని నలుమూలల జరిపిన ఈ సర్వేలోని అంశాలన్నీ మోడీకి అనుకూలంగా ఉండటం గమనార్హం. 15వేల మంది దేశ పౌరులు నోటి మాటను 135 కోట్ల భారతావనికి మాటగా చెప్పటం ఎంతవరకు సబబు అన్న విషయాన్ని కాస్త పక్కన పెట్టి.. సర్వే వివరాల్ని చూస్తే..

76 శాతం; తమ భవిష్యత్తును ఆశావాహంగా స్వచ్ఛ భారత్.. మేకిన్ ఇండియా కార్యక్రమాలు చేస్తున్నాయన్నవారు

72 శాతం; మోడీ పాలనలో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని చెప్పినవారు

64 శాతం; తమ అంచనాలకు అనుగుణంగా మోడీ సర్కారు పని చేస్తుందని చెప్పినోళ్లు

61 శాతం; జీఎస్ టీ బిల్లు ఆమోదం కోసం మోడీ సర్కారు శక్తి వంచన లేకుండా పని చేసిందన్నోళ్లు

51 శాతం; పాక్ తో భారత్ సంబంధాల్లో ఎలాంటి మార్పులు లేవన్నోళ్లు

34 శాతం; పాక్ తో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయన్న వాళ్లు

నెగిటివ్ మార్క్స్

= మరిన్ని ఉద్యోగులు సృష్టించాలి

= పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి

= స్త్రీలు.. పిల్లల భద్రత.. ధరల నియంత్రణలో మరింత బాగా పని చేయాలి