Begin typing your search above and press return to search.

సంక్షేమం గెలిపించ‌డం క‌ష్ట‌మే... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన స‌ర్వే!

By:  Tupaki Desk   |   19 Sep 2022 2:30 PM GMT
సంక్షేమం గెలిపించ‌డం క‌ష్ట‌మే... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన స‌ర్వే!
X
వ‌చ్చే 2024 లేదా.. అంత‌కు ముందే.. జ‌రుగుతాయ‌ని భావిస్తున్న ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం న‌మ్ముకున్న ప‌దునైన ఆయుధం.. సంక్షేమం. తాము అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమాన్ని అమ‌లు చేస్తున్నాం.. అప్పులు చేసి తీసుకువ‌చ్చి మ‌రీ.. ప్ర‌జ‌ల ఖాతాల్లోసొమ్ములు వేస్తున్నాం.. సో.. మాకు త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారు..? అని .. వైసీపీ అధినేత జ‌గ‌న్ ధీమాగా ఉన్నారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని అనేక వేదిక‌ల‌పైనా ప్ర‌స్తావిస్తున్నారు.

అయితే..తాజాగా ఇదే విష‌యంపై స‌ర్వే చేసిన‌.. పీకే టీం.. సంచ‌ల‌న‌నివేదికను అందించిందని.. పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. సంక్షేమం మంచిదే.. కానీ.. ఇదే గెలిపిస్తుంద‌ని.. ఇదే అధికారం అప్ప‌గిస్తుందని.. చెప్పే ప‌రిస్థితి లేద‌ని.. స‌ర్వే నివేదిక వెల్ల‌డించింద‌ని గుస‌గుస వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. కూడా ఉంద‌ని అంటున్నారు. సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. ప్ర‌భుత్వం ఇస్తున్న సొమ్ములు.. కొన్ని వ‌ర్గాలకు మాత్ర‌మే చేరుతున్నాయి. దీంతో మిగిలిన వ‌ర్గాలు.. మాత్రం ఆగ్ర‌హంతో ఉన్నాయ‌ని.. అంటున్నారు.

సంక్షేమం అమ‌లు ఒక్క‌టే ప్రాతిప‌దిక కాద‌ని.. కూడా స‌ర్వే నివేదిక స్ప‌ష్టం చేసింద‌ట‌. పెద్ద‌గా సంక్షేమ అమ‌లు చేయ‌ని.. బిహార్‌.. యూపీ రాష్ట్రాల్లో అక్క‌డి ప్ర‌భుత్వాలు వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తిని.. స‌ర్వేస్ప‌ష్టం చేసింద‌ట‌.

దీనికి కార‌ణం.. ''ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఉంటే చాలు. సీఎం బాగానే చేస్తున్నారు ' అనే సంకేతాన్ని.. ఆయా ప్ర‌భుత్వాలుప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాయ‌ని అంటున్నారు. ఇదే ఫార్ములాను.. ఏపీలోనూ అమ‌లు చేయాల‌ని స‌ర్వే సూచించింద‌ని చెబుతున్నారు.

అంటే.. ఏపీలోనూ.. సీఎం జ‌గ‌న్‌పై ఫీల్ గుడ్ అనే భావ‌న‌ను తీసుకురావాల్సి ఉందని.. అదేస‌మ‌యంలో ఈ ప్ర‌భుత్వం బాగానే చేస్తోంద‌నే ఆలోచ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని..స‌ర్వే తెలిపిందట‌.

ఈ రెండు లేకుండా.. కేవ‌లం సంక్షేమం అమ‌లు చేసినంత మాత్రాన ప్ర‌భుత్వం మ‌ళ్లీ ద‌క్కుతుందని ఆశించొద్ద‌ని కూడాహెచ్చ‌రించిన‌ట్టు చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు.. సంక్షేమం అందుతున్న‌వారు స‌రే.. అంద‌ని వారిని కూడా త‌న‌వైపు తిప్పుకోవాల‌ని.. జ‌గ‌న్‌కు సూచించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం దీనిపైచ‌ర్చ సాగుతోంద‌ని అంటున్నారు. మ‌రి చివ‌ర‌కు జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.