Begin typing your search above and press return to search.
సర్వేతో చినబాబును దారికి తెచ్చుకున్నారా?
By: Tupaki Desk | 28 Jun 2018 11:25 AM ISTమీడియాకు మించి పోయిన సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడు ఎలాంటి విషయం తెర మీదకు వస్తుందో అర్థం కాని పరిస్థితి. నిజమన్నట్లుగా కొన్ని వాదనలు వినిపించటమే కాదు.. అందుకు తగ్గ లాజిక్కులు కూడా పర్ ఫెక్ట్ గా వినిపిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా అలాంటి ఆసక్తికర విషయం ఒకటి అమరావతిలో చక్కర్లు కొడుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ మంత్రి లోకేశ్ ఇటీవల కాలంలో తన తీరుకు భిన్నంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. తన తండ్రి అభిమానించి.. దగ్గరకు తీసే పెద్దమనిషిని చినబాబు పెద్దగా కేర్ చేయలేదన్నది టాక్. దీంతో.. ఒళ్లు మండిన సదరు పెద్ద మనిషి.. టీడీపీ పరిస్థితి ఏపీలో ఏమాత్రం బాగోలేదన్న టాక్ తెర మీదకు తీసుకొచ్చారట.
అసలు జగన్ ఫోబియోతో వణుకుతున్న తెలుగు తమ్ముళ్లకు.. పెద్దమనిషి తెర మీదకు తెచ్చిన ఓటమి సర్వే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటమే కాదు.. చినబాబుకు సైతం భారీ షాక్ ను ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తన కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో సదరు పెద్ద మనిషి ఇగోను సంతృప్తి పర్చిన లోకేశ్.. ఓటమి సర్వే ఇబ్బందిని ఏకరువు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. అభయమిచ్చిన పెద్ద మనిషి మేజిక్ చేసి చూపిస్తానని చెప్పటమే కాదు.. ఏపీలో అధికారపక్షానికి ప్రజల్లో అదిరిపోయే పట్టు ఉందని.. ఎన్నికలు జరిగితే భారీ మెజార్టీతో గెలవటం ఖాయమన్న మాటను తాజాగా ప్రచారంలోకి తెచ్చేశారట.
ఓపక్క జగన్ పాదయాత్రకు జిల్లాలకు జిల్లాలు టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టర్న్ అయిపోతున్న వాదన బలంగా వినిపిస్తున్నవేళ.. అందుకు భిన్నంగా టీడీపీ గెలుపు సర్వే వ్యవహారమంతా చినబాబు కోసమేనని చెబుతున్నారు. మిగిలిన ముచ్చట్లు ఎలా ఉన్నా.. తమకు అనుకూలంగా తెర మీద కనిపిస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సదరు సర్వే ల్లో తమకు అనుకూలంగా కనిపించిన అంకెల్ని చూసి చినబాబు తెగ సంతోషపడిపోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మాటల్లో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. అమరావతి సర్కిల్స్ లో మాత్రం ఈ ప్రచారం జోరుగా సాగుతోంది.