Begin typing your search above and press return to search.
లోకేశ్ పనితీరుపై సర్వే రిపోర్టు.. బాబు ఏం చెప్పారంటే?
By: Tupaki Desk | 29 Oct 2022 7:30 AM GMTపార్టీకి ఆయనే సుప్రీం. ఆయన రాజకీయ వారసుడిగా పేరున్న కొడుకు విషయంలో ఎలా వ్యవహరిస్తారు? ఎక్కడైనా బావే కానీ.. వంగతోట దగ్గర మాత్రం కాదన్న తెలుగు సామెతను నూటికి నూరుపాళ్లు పాలో అయ్యే ఏకైక వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు నిలుస్తారు. దేశంలో బోలెడన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయినప్పటికి.. ఆ ప్రాంతీయ పార్టీల అధినేతలు.. తమ రాజకీయ వారసుల పని తీరును మదింపు చేయించి.. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా సలహాలు చెప్పి.. సూచనలు చేయటం లాంటివి చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతాయి.
తాజాగా అలాంటి సీన్ ఒకటి టీడీపీ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకుంది. మంగళగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బరిలోకి దిగి.. చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న లోకేశ్.. వచ్చే ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని డిసైడ్ కావటమే కాదు.. ఆ దిశగా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి మూడున్నరేళ్లు అవుతున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో ఓడినప్పటికీ..నియోజకవర్గంతో మరింత టచ్ లో ఉండటమే కాదు.. తరచూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు నారా లోకేశ్. అంతేకాదు.. పలు సేవా కార్యక్రమాల్ని చేపట్టారు. ఇదిలా ఉంటే.. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో రివ్యూ భేటీ నిర్వహిస్తున్నారు చంద్రబాబు. తాజాగా లోకేశ్ బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్న మంగళగిరి నియోజకవర్గంపై రివ్యూ చేపట్టారు.
ఈ సమీక్షలో భాగంగా తండ్రి కమ్ పార్టీ అధినేత చంద్రబాబు ఎదుట హాజరయ్యారు లోకేశ్. ఆయన పని తీరుపై తనకు అందిన సర్వే రిపోర్టును చూసిన చంద్రబాబు.. లోకేశ్ పని తీరు బాగానే ఉందన్న ఆయన.. నియోజకవర్గంలో మరింత పట్టు పెంచాలన్న విషయాన్ని లోకేశ్ కు స్పష్టం చేశారు.
తాజా సర్వే రిపోర్టు సంత్రప్తికరంగా ఉన్నప్పటికీ.. మరింత శ్రమించాలన్న విషయాన్ని చినబాబుకు చెప్పారు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలు అన్నింటిలోనూ లోకేశ్ పని చేసిన తీరుపై బాబు సంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరింత గట్టిగా నియోజకవర్గంలోని కార్యకలాపాలపై దృష్టి సారించాలన్న సూచనను చేశారు. ఏమైనా.. తన రాజకీయ వారసుడిని సైతం మిగిలిన వారి మాదిరే రివ్యూ చేసిన వైనం ఇప్పుడు టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏమైనా ఇలాంటివి చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.