Begin typing your search above and press return to search.
మోడీ మరింత చెలరేగిపోయే సర్వే రిపోర్టు వచ్చింది
By: Tupaki Desk | 28 Jan 2020 1:30 AM GMTఒకటి తర్వాత ఒకటి చొప్పున సంచలన నిర్ణయాలు తీసుకోవటం ఏ ప్రభుత్వానికైనా సామాన్యమైన విషయం కాదు. కానీ.. అందుకు భిన్నంగా రెండో దఫా ప్రధాని పదవిని చేపట్టిన నాటి నుంచి వరుస పెట్టి సంచలన నిర్ణయాలు తీసుకోవటం.. ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇష్యూలను క్లోజ్ చేసే పనిని ఒక ఆపరేషన్ లా చేసుకుంటూ వెళుతున్నారు మోడీ. ఈ క్రమంలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉభయ సభల్లో ఆమోదించినా.. మిగిలిన నిర్ణయాలకు భిన్నంగా ఈ అంశం మీద మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నిరసనలు.. ఆందోళనలు కొన్ని పార్టీలు.. వర్గాలకే పరిమితమా? లేక దేశ ప్రజల్లోనూ ఇలాంటి తీరే ఉందా? అన్న సందేహం కొన్నిరోజులుగా కలుగుతోంది. ఇలాంటి సందేహాలకు సమాధానం చెప్పేలా తాజాగా ఒక సర్వే రిపోర్టు బయటకు వచ్చింది. సర్వేల విషయంలో మాంచి పట్టున్న సంస్థగా పేరున్న ఐఏఎన్ఎస్-సీ ఓటర్ ఒక సర్వేను విడుదల చేసింది. సీఏఏ.. ఎన్నార్సీల మీద ఆందోళనల మాట ఎలా ఉన్నా.. ప్రధాని మోడీకి ఉన్న ఆదరణ ఏ మాత్రం చెక్కు చెదరలేదన్న విషయం తాజాగా వెల్లడైంది.
తాజా సర్వేలో మోడీ పాలనపై 56.4 శాతం చాలా సంతృప్తి వ్యక్తం చేయటం గమనార్హం. దేశ ప్రధానిగా మోడీనే ఉండాలన్న వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. ఏకంగా 62.3 శాతం మంది మోడీ వైపే మొగ్గు చూపారు. ఇక.. లోక్ సభకు జరిగే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికే ఓటు వేస్తామని ఏకంగా 70 శాతం మంది స్పష్టం చేయటం చూస్తే.. దేశంలో మోడీ ప్రభ అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గటం లేదన్న భావన కలగటం ఖాయం.
మోడీ పాలనపై పెదవి విరిచిన వారు.. అసంతృప్తి వ్యక్తం చేసిన వారు 19.8 శాతం మంది కావటమ గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 330 సీట్లు సొంతంగా తెచ్చుకోవటం ఖాయమని తేల్చింది. ఇంకెందుకు ఆలస్యం మోడీజీ.. పెండింగ్ లో ఉన్న సంచలన నిర్ణయాల్ని మరిన్ని తీసుకోవటానికి అవసరమైన దన్ను తాజా సర్వేతో వెల్లడైందని చెప్పక తప్పదు. మరి.. మోడీ మాష్టారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.