Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత.. కేసీఆర్ ముందుకు సర్వేల ఫలితాలు
By: Tupaki Desk | 31 March 2022 7:32 AM GMTతెలంగాణలో ప్రజా నాడి డిఫరెంట్‌గా ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజ లు సానుకూలంగానే ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వాన్ని వారు కోరుకుంటున్నారు. ఆయన విష యంలో వారికి ఎలాంటి రెండో థాట్ కూడా కనిపించడం లేదు. కానీ.. అదేసమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే లపై మాత్రం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో 2019లో జరిగిన ఏపీఎన్నికల్లోనూ టీడీపీ విషయంలో ఇదే జరిగింది. పార్టీ అధినేతగా.. విజన్ ఉన్న నాయకుడిగా.. చంద్రబాబును ప్రజలు కోరుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
ప్రజాగ్రహం.. మామూలుగా లేదు
ఈ క్రమంలో చాలా చోట్ల ఎమ్మెల్యేలను మార్చాలనే డిమాండ్లు వచ్చినా.. చంద్రబాబు పట్టించుకోలేదు. ఫలితంగా.. పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఇప్పుడు.. ఇలాంటి పరిణామమే.. తెలంగాణలోనూ కని పిస్తోంది. సీఎం పైనా.. వ్యక్తిగతంగా కేసీఆర్‌పైనా.. ఇక్కడి ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. కానీ.. సిట్టిం గ్ ఎమ్మెల్యేల విషయంలోనే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. కనీసం ఎమ్మెల్యే తమను పట్టించు కోవడం లేదని.. నియోజకవర్గానికి కూడా రావడం లేదని.. సమస్యలు పరిష్కరించడం లేదని.. 100కు పైగా నియోజకవర్గాల్లో ప్రజలు గగ్గోలు పెడుతున్నారట.
విస్తృత సర్వేలు
ఈ క్రమంలో ఆయా ఎమ్మెల్యేలపై ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారు.. ఈ నేపథ్యంలోనే.. వీరికి కనుక ఇప్పటికిప్పుడు టికెట్లు ఇస్తే.. పరిస్థితి ఇబ్బందిగా మారుందని.. వివిధ సర్వేలు కేసీఆర్‌కు తేల్చి చెప్పిన ట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కేసీఆర్ సర్వే చేయించారు. అదేవిధంగా.. పార్టీ వర్గాలతోనూ .. ఆయన సర్వే చేయించారు.. వీటిలో ఇప్పటి వరకు జరిగిన సర్వేలో.. ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేల విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలుస్తోంది.
తుదినివేదిక 15 రోజుల్లో!
మొత్తం 103 మంది సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు జరిపిన సర్వేలో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. చాలా చోట్ల సిట్టింగ్ లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైంది. ఏళ్లపాటు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ.. వీరు ప్రజలకు చేరువ కాలేక పోయారు. ప్రజల సమస్యలు పట్టిం చుకోలేక పోయారని సర్వేలో ప్రజలు స్పష్టం చేసినట్టు సమాచారం. టీఆర్ ఎస్ మిత్రపక్షం.. ఏఐఎంఐ ఎంకు ఉన్న 7 స్థానాలు మినహా మొత్తం 112 అసెంబ్లీ నియోజకవర్గాల తుది సర్వే నివేదికలను ఏప్రిల్ 15లోగా అందనున్నట్టు సమాచారం. అయితే. ఇప్పటికే 30 స్థానాల రిపోర్టు మాత్రం సమగ్రంగా కేసీఆర్ చెంతకు చేరినట్టు తెలిసింది.
ముందు నుయ్యి..వెనుక గొయ్యి..
పోనీ.. ప్రజాగ్రహం ఎక్కువగా ఉందికదా.. అని ఇంత మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టే పరిస్థితి లేదు. వీరిలో సగం మంది రెబల్‌గా మారినా.. పార్టీకి ప్రమాదమే. పైగా..ఇంత మంది కొత్తవారిని వెతకడం కూడా కేసీఆర్‌కు కష్టమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అంచనా వేస్తూ, వారిలో కొందరికి పనితీరును మెరుగుపరచుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ఏడాది పైనే సమయం ఉన్న నేపథ్యంలో వారిని పిలిచి క్లాస్ ఇవ్వడంతోపాటు... దిశానిర్దేశం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
అప్పటికి కూడా.. ప్రజల్లో ఉండని నాయకులు.. పార్టీని ధిక్కరించే నాయకులను పక్కనపెట్టడం ఖాయ మని తెలుస్తోంది. ఏదేమైనా.. ప్రస్తుతం టీఆర్ ఎస్ మరోసారి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావా లని.. గట్టిగా నిర్ణయించుకున్న నేపథ్యంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా కేసీఆర్ వెనుకాడే పరిస్థితి లేదని... తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.