Begin typing your search above and press return to search.

హోటల్ రొమాంటిక్.. ఇల్లు పాతటిక్ !

By:  Tupaki Desk   |   30 Nov 2015 10:30 PM GMT
హోటల్ రొమాంటిక్.. ఇల్లు పాతటిక్ !
X
శృంగారానికి సరైన ప్లేస్ ఏది? ఇల్లా..? హోటల్ రూమా? ఇల్లు ఉండగా.. హోటల్ రూమ్ ఎందుకన్న సందేహం కలగొచ్చు కానీ.. ఇదే అంశం మీద ఒక సర్వేను తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లడైన అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. అలా అని ఈ వివరాలు ఏదో చిన్న చితకా శాంపిల్ తో చేపట్టినవి కాదు. 11 దేశాలకు చెందిన దాదాపు 2,200 మందితో మాట్లాడితే తాజాగా కొన్ని విషయాల్ని తేల్చారు.
పార్టనర్ తో కలిసి శృంగారానికి హోటల్ కు మించిన బెస్ట్ ప్లేస్ మరొకటి ఉండదని అత్యధికులు అభిప్రాపడటం విశేషం. అంతేకాదు.. ఇంటితో పోలిస్తే.. హోటల్ రూంలో పార్టనర్లు ఇద్దరూ చెలరేగిపోతారంట. దీర్ఘకాలిక శృంగారానికి హోటల్ రూమ్ వేదిక అవుతుందని తేల్చారు. ఇంటితో కొద్ది నిమిషాల పాటు సాగే.. శృంగారం హోటల్ రూమ్ లో మాత్రం 25 నిమిషాల నుంచి 49 నిమిషాల వరకూ ఉంటుందని చెబుతున్నారు. క్వాలిటీ రొమాన్స్ కు హోటల్ రూమ్ బెస్ట్ ఛాయిస్ గా చెబుతున్నారట.

ఈ విషయాన్ని బ్రిటీషర్లతో పాటు కెనడియన్లు.. పలుదేశాలకు చెందిన వారు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నట్లుగా సర్వే పేర్కొంది. ఒక్క ఇటాలియన్లు మినహాయిస్తే.. ఆస్ట్రేలియన్లు.. రష్యన్లు సైతం ఇంటితో పోలిస్తే.. హోటల్ రూమ్ లో చెలరేగిపోతారని.. దీనికి హోటల్ రూమ్ లో ఉండే బెడ్స్ కూడా కీలక భూమిక పోషిస్తాయని చెబుతున్నారు. మిగిలిన దేశాల వారితో పోలిస్తే.. కెనడియన్లు.. శృంగారానికి పెద్ద బెడ్ కు ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. మరి.. హోటల్ అనుభవం లేని వారు ఒకసారి ప్రయత్నించి చూస్తే.. ప్రయోజనం ఉంటుందేమో. అలా అని.. ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లకుండా.. హోటల్ గుణగణాలు.. వాటి వివరాలు సేకరించిన తర్వాతే ముందడుగు వేయటం మాత్రం మర్చిపోవద్దు సుమా.