Begin typing your search above and press return to search.
పవన్ పోటీ చేసేది ఇక్కడే..!?
By: Tupaki Desk | 27 Jan 2019 8:07 AM GMTసినిమాల నుంచి పూర్తిగా రాజకీయాల వైపు దృష్టి సారించిన పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జనసేన పార్టీ పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఆయన నిర్వహించిన యాత్రల్లో ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర నుంచి మద్దతు తెలుపుతున్నట్లు సామాజిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఆయన ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
దీంతో పార్టీ నాయకులు ఆ ప్రాంతాల్లో సర్వే చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతాల్లో అయితే పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు.. మిగతా ప్రాంతాల్లో అయితే భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాన్నాయని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పవన్‌కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభను నిర్వహించిన ఆయన ఆదివారం సాయంత్రం మరో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇక ఫిభ్రవరిలో అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలతో పార్టీలోని నాయకులతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పార్టీలోని శ్రేణుల్లో అనుమానాలు తొలగించేందుకు పవన్ ఇలా బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల్లో సీట్లు కేటాయింపుపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.