Begin typing your search above and press return to search.

యూపీలో బీజేపీ గెలుపు.. స‌ర్వేలు చెబుతున్న వాస్త‌వం ఏంటి?

By:  Tupaki Desk   |   9 Jan 2022 3:50 AM GMT
యూపీలో బీజేపీ గెలుపు.. స‌ర్వేలు చెబుతున్న వాస్త‌వం ఏంటి?
X
దేశంలో పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి వ‌చ్చే నెల 10 నుంచి ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుద‌లైంది. అయితే.. ఇప్పుడు ఇక్క‌డ ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? అనే విష‌యంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ ప్రారంభమైంది. అధికారంలో బీజేపీ ఉంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా యువ నేత అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ ఉంది. ఇక‌, మ‌రిన్ని పార్టీలు.. బీఎస్పీ, కాంగ్రెస్‌, ఎంఐఎం, అకాలీద‌ళ్‌, జ‌న‌మోర్చా.. ఇలా చిన్నా చిత‌కా పార్టీలు ప‌దుల సంఖ్య‌లో ఉన్నాయి.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు.. బీజేపీ తిరిగి అధికారం నిల‌బెట్టుకుంటుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. అయితే.. ఇది అంత తేలిక కాద‌ని.. దీనివెనుక పెద్ద‌లు చ‌క్రాలు తిప్పి ఉంటార‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. దీనికి కూడా ఒక కార‌ణం ఉంది. ప్ర‌స్తుతం యోగి పాల‌నపై తీవ్ర వ్య‌తిర‌క‌త ఉన్న విష‌యం వాస్త‌వం. అయితే.. కొన్నాళ్ల కింద‌ట‌.. యోగిని సీఎం ప‌ద‌వి నుంచి దింపేయాలంటూ.. డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే.. మోడీకి అత్యంత ప్రీతిపాత్రుడు కావ‌డంతో ఆయ‌న స్థానం చెరిగిపోలేదు. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌తిరేక‌త ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌ధానంగా ముస్లిం వ‌ర్గం ఎలాగూ బీజేపీకి దూరంగా ఉంది. దీనికి ఇప్పుడు జాట్ల వ‌ర్గం క‌లిసి వ‌చ్చింది. ఇదే ఇప్పుడు బీజేపీకి బెంగ ప‌ట్టుకునేలా చేసింది. అదేస‌మ‌యంలో బ్రాహ్మ‌న సామాజిక వ‌ర్గం మెజారిటీ ఓటు బ్యాంకును క‌లిగి ఉండ‌డం.. వీరికి యోగి స‌ర్కారులో ప్రాధాన్యం క‌ల్పించ‌లేద‌ని.. బీఎస్పీ.. ఎస్పీ వంటి కీల‌క పార్టీలు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం.. బీజేపీకి ఇబ్బందిగా మారింద‌నేది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే ముందస్తు.. స‌ర్వే అంటూ.. బీజేపీనే మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌ని పేర్కొంటూ.. ఒక స‌ర్వేను ప్ర‌జ‌ల్లోకి వ‌దిలార‌ని చెబుతున్నారు. అయితే.. ఈ స‌ర్వే ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన ఐదు అంశాలు బీజేపీకి ప్ల‌స్‌గా మారాయి.

ఒక‌టి.. హిందువుల ప‌విత్ర క్షేత్రం.. కాశీని ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అభివృద్ధి చేయ‌డం, రెండు రామమందిర నిర్మాణం చేప‌ట్ట‌డం. మూడు.. బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి ఈ ద‌ఫా మెజారిటీ సీట్లు.. అధికారంలోకి వ‌చ్చాక మెజారిటీ ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీ ఇవ్వ‌డం.. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను అభివృద్ధి చేయ‌డం.. త‌ర‌చుగా.. ప్ర‌ధాన మంత్రి ఈ రాష్ట్రంలో ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డం వంటివి బీజేపీకి క‌నిపిస్తున్న ప్ర‌ధాన ప్ల‌స్‌లుగా భావిస్తున్నాయి.

ఇక‌, కాంగ్రెస్ ఊసు ఉత్త‌రప్ర‌దేశ్‌లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం కావ‌డం.. రాహుల ప్ర‌స్తావ‌న లేకుండానే.. ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ వెళ్ల‌డం.. వంటివి కూడా.. బీజేపీకి క‌లిసివ‌స్తున్నాయి. అయితే.. చివ‌రి నిముషంలో ప్ర‌జ‌ల మైండ్ సెట్ మారితే.. త‌ప్ప‌.. ఇప్ప‌టికైతే.. యోగి మ‌రోసారి సీఎం పీఠం ఎక్క‌డం ఖాయ‌మ‌ని.. బీజేపీ నేత‌లు అంచ‌నాలు వేసుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.