Begin typing your search above and press return to search.
సర్వేలను నమ్ముకుంటే అంతే సంగతులా ?
By: Tupaki Desk | 9 Nov 2021 1:30 PM GMTసర్వేలు పాలకులను భ్రమల్లో ముంచేస్తుంది. సర్వేలు పాలకులను తప్పు దోవ పట్టిస్తాయి. సర్వేలు వాస్తవ జనాభి ప్రాయం ఏమిటో తెలీ కుండా పాలకుల కళ్ళ కు గంతలు కట్టేస్తాయి. అవును పై మూడు అంశాలు వాస్తవమే. ఎందుకంటే అధికారం లో ఉన్నవారు జనాభి ప్రాయం తమకు వ్యతిరేకం గా ఉండటాన్ని ఏ మాత్రం సహించలేరు. అందుకనే పాలకుల మన సెరిగిన సంస్థలు కూడా సర్వేల్లో పాలకుల ఇమేజ్ ఆకాశ మంత ఎత్తు లో ఉందని ఊదర గొట్టేస్తుంటాయి. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కదా అయ్య గారి అసలు బండారం బయటపడేది.
ఇంతకీ విషయం ఏమిటంటే ప్రపంచంలోని పాలకుల్లో నరేంద్ర మోడినే 70 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేసు లో ఉన్నారంటు ఓ సర్వే ఫలితం విడుదలైంది. సర్వేలు, దాని ఫలితాలు ఎవరు చేస్తారు ? ఎలా మ్యానేజ్ చేస్తారో జనా లందరికీ తెలుసు. ప్రధాన మంత్రి గా మోడి ఉన్నారు కాబట్టి పాలకుల్లో ఆయనే టాప్ అని సర్వే ఫలితం రావటం లో ఆశ్చర్యం లేదు. ఎందు కంటే జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల జనాభా అంతా కలిపినా ఇండియా జనాభా అంతుండదు. కాబట్టి పై దేశాల పాలకు లందరిలోకి మోడినే టాప్ అని సర్వే లో తేలటం లో గొప్పేముంది ?
ఒక వేళ సర్వే ఫలితం నిజమే అనుకుంటే మరి మొన్ననే జరిగిన 29 అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ ఎందుకని 7 సీట్లు మాత్రమే గెలిచింది. హిమాచల్ ప్రదేశ్ లో అధికారం లో ఉన్నప్పటికీ ఎన్నికలు జరిగిన 3 సీట్లలోను ఎందుకు ఓడిపోయింది ? మహారాష్ట్ర లో సిట్టింగ్ పార్లమెంటు స్ధానాన్ని ఎందుకు కోల్పోయినట్లు ? హర్యానా లో ఎందుకని గెలవ లేదు. పశ్చిమబెంగాల్లోని నాలుగు సీట్లూ ఇందు లో రెండు బీజేపీ సిట్టింగ్ స్ధానాల్లో ను ఎందుకు ఓడి పోయింది ? కాబట్టి సర్వే ఫలితాలతోను క్షేత్రస్థాయి లో వాస్తవానికి చాలా తేడాలుంటాయి.
ఒకపుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే సర్వేలు చేయించుకునే వారు. అధికారం లో ఉన్నారు కాబట్టి రిపోర్టు లో పరిపాలన బ్రహ్మాండమని వచ్చేది. 2019 ఎన్నికల సమయం లో కూడా తన పాలన పై 90 శాతం జనాలు హ్యాపీగా ఉన్నారని సర్వే రిపోర్టు లో వచ్చిందని చంద్రబాబే చెప్పుకున్నారు. తీరా ఎన్నికల ఫలితాల్లో ఏమొచ్చింది ? ఫలితాలు చూసిన చంద్రబాబు కు మైండ్ బ్లాంకై దిమ్మ తిరిగింది. కాబట్టి సర్వేలను నమ్ముకుంటే అంతే సంగతులు.
ఇదే విషయం జగన్మోహన రెడ్డి, కేసీయార్ ఇలా అధికారం లో ఉన్న ఎవరికైనా వర్తిస్తుంది. సర్వేలు చేసే సంస్ధలు కూడా పాలకులకు వ్యతిరేకం గా ఫలితం వచ్చినా దాన్ని యథా తథంగా చెప్పవు. ఎందు కంటే పాలకుల మంచి కోరుతు సదరు సంస్ధలు సర్వేలు చేయవు. అలాంటి సంస్ధలవి ఫక్తు బిజినెస్ మాత్రమే. జనాల్లో ఆదరణ పడి పోయిందంటే రావాల్సిన డబ్బులు రావు. అందుక నే బ్రహ్మాండమని తప్పుడు ఫలితాలు చూపిందే అవకాశాల ఎక్కువ. కాబట్టి ఇలాంటి బాకాలూదే సర్వేలను నమ్ముకుంటే అంతే సంగతులు.