Begin typing your search above and press return to search.

సూర్యా.. న్యూజిలాండ్​కు వచ్చేయ్.. స్కాట్ స్టైరిస్ ఆఫర్​

By:  Tupaki Desk   |   30 Oct 2020 9:50 AM GMT
సూర్యా.. న్యూజిలాండ్​కు వచ్చేయ్.. స్కాట్ స్టైరిస్ ఆఫర్​
X
మంబై ఇండియన్స్​ ఆటగాడు సూర్యకుమార్​ యాదవ్​ పేరు ఇప్పడు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. వివిధ దేశాల క్రికెటర్లు సూర్యకుమార్​ను ప్రశంసిస్తున్నారు. బీసీసీఐ అతడిని ఎంపికచేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ చెలరేగి ఆడిన విషయం తెలిసిందే. 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 79 పరుగులు చేశాడు. అంతకు ముందు మ్యాచ్​ల్లోనే సూర్యకుమార్​ బాగానే రాణించాడు. అయినప్పటికీ భారత జాతీయ జట్టులో అతడికి చోటు దక్కలేదు.

ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్, ఆ తర్వాత జరగనున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు.అందులో సూర్యకుమార్ యాదవ్ లేకపోవడంతో క్రికెట్​ అభిమానులు ఆశ్చర్యపోయారు. మాజీ క్రికెటర్లు సైతం బీసీసీఐ తీరును తప్పుపట్టారు. బుధవారం 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. సూర్యకుమార్ ఆటకు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ ఫిదా అయిపోయాడు.

‘సూర్యకుమార్​ ఎంతో ప్రొఫెషనల్​గా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా టూర్​కు అతడిని ఎంపిక చేయకపోవడం చూసి ఎంతో ఆశ్చర్యపోయా. ఒకవేళ సూర్యకుమార్​ అంతర్జాతీయ క్రికెట్​లో ఆడాలనుకుంటే వెంటనే న్యూజిలాండ్​ వచ్చేయాలి’ అంటూ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు.

స్టైరిస్ పోస్టు నెట్టింట్లో వైరల్​గా మారింది. న్యూజిలాండ్​ ఆఫర్​ చూసైనా బీసీసీఐకి కనువిప్పు కలగాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.