Begin typing your search above and press return to search.

సూర్య ఔట్ కాదు.. తొండి ఆట ఆడిన ఇంగ్లండ్

By:  Tupaki Desk   |   19 March 2021 3:30 PM GMT
సూర్య ఔట్ కాదు.. తొండి ఆట ఆడిన ఇంగ్లండ్
X
ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టీ20లో మంచి జోరు మీద ఉన్న టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వివాదాస్పద రీతిలో ఔట్ కావడంపై పెను దుమారం చెలరేగింది. అతడు కొట్టిన బంతి నేలను తాకుతూ క్యాచ్ పట్టారని తెలిసినా అంపైర్లు రిప్లై చూసి మరీ ఔట్ ఇవ్వడం దుమారం రేపింది. అనవసరం సూర్య ఔట్ కావాల్సి వచ్చింది. లేకుంటే టీమిండియా మరింత భారీ స్కోరు చేసి ఉండేది. ఈ మ్యాచ్ లో గెలిచింది కాబట్టి సరిపోయింది.. ఓడిపోయింటే అది అంపైరింగ్ నిర్ణయాల వల్లేనని విమర్శలు వచ్చాయి.

ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ వేసిన 14వ ఓవర్ లో బంతిని బలంగా బాదిన సూర్యకుమార్ గాల్లోకి లేపగా ఆ క్యాచ్ ను మలాన్ క్యాచ్ పట్టాడు. అయితే బంతి అతడి చేతుల్లో పడీపడగానే నేలను తాకింది. టీవీ అంపైర్ పలుమార్లు రిప్లై చూసి ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ‘సాఫ్ట్ సిగ్నల్’ ఔట్ కే మొగ్గు చూపడంతో సూర్యకుమార్ నాటౌట్ అయినా కూడా వెనుదిరగాల్సి వచ్చింది.

బంతి నేలను తాకుతున్నట్టు తెలిసినా కూడా ఔట్ ఇవ్వడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. అంపైరింగ్ నిర్ణయాలు తనను షాక్ కు గురిచేశాయని అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. తొలి సారి బ్యాటింగ్ కు దిగిన సూర్య 57 పరుగులు చేయడంతో ఇండియా గెలుపునకు కారణమయ్యాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. శార్దుల్ వరుస బంతుల్లో రెండు వికెట్ల తీయడంతో ఇండియా మ్యాచ్ గెలిచింది.