Begin typing your search above and press return to search.
నమాజ్, సూర్యనమస్కారాలు సేమ్ టూ సేమ్
By: Tupaki Desk | 30 March 2017 9:01 AM GMTబీజేపీ యోగాను ప్రపంచవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న నేపథ్యంలో వస్తున్న విమర్శలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తిప్పి కొట్టారు. యోగా కేవలం హిందూమతానికి సంబంధించింది కాదన్నారు. యోగా అందరిదని చెప్పారు. ముస్లింలు చేసే నమాజ్ కు.. సూర్య నమస్కారాలు రెండూ ఒకటేనన్నారు.
ముస్లింలు ఆచరించే నమాజ్, హిందువులు చేసే సూర్యనమస్కారాలు రెండింటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. సూర్యనమస్కారాల్లో భాగంగా వేసే ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామ క్రియలు.. నమాజ్ సమయంలో ముస్లింలు చేసినట్టుగానే ఉంటాయని పేర్కొన్నారు. యోగా కేవలం హిందూమతానికి సంబంధించిన అంశం కాదని చెప్పే యత్నంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లక్నోలో నిర్వహించిన ఓ యోగా కార్యక్రమానికి హాజరైన యోగి ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఇంతవరకు పాలకులెవరూ యోగాకు ప్రాధాన్యమివ్వలేదని... అధికారంలో ఉన్నవాళ్లు భోగాల కోసం అలమటించారే తప్ప యోగా గురించి ఆలోచించలేదని విమర్శించారు. కులమతాల పేరుతో దేశాన్ని విడగొట్టాలని భావిస్తున్న వారికి యోగా గురించి పట్టదన్నారు. 2014కు ముందు యోగా గురించి మాట్లాడిన వారికి మతం రంగు పులిమేవారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ యోగాను అంతర్జాతీయం చేసేందుకు కృషి చేస్తున్నందుకు యోగి ప్రశంసించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/