Begin typing your search above and press return to search.
జయరాం హత్యకేసులో సినీ నటుడు?
By: Tupaki Desk | 16 Feb 2019 3:32 AM GMTప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో తవ్వినకొద్ది కొత్త వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్య వెనుక ప్రధానంగా ఆర్థిక లావాదేవీలే కారణమని ఇన్నాళ్లు అందరూ భావించారు. కానీ ఈ కేసులో తెరవెనుక ఉన్న ఎన్నో చిక్కుముడులను పోలీసులు విప్పుతున్నారు.
తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రముఖ టాలీవుడ్ నటుడు సూర్య ప్రకాష్ ను పోలీసులు విచారించడం ఆసక్తిగా మారింది. ‘బాహుబలి1’ సినిమాలో ప్రభాస్ కు స్నేహితుడిగా నటించిన సూర్య ప్రకాష్ తాజాగా ‘కలియుగ’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో సహాయం కోసం రాకేష్ రెడ్డిని అభ్యర్థించాడు. కొద్దినెలలుగా రూ.25 లక్షల అప్పు కోసం రాకేష్ రెడ్డి వెంట తిరుగుతున్నాడు. దాంతో రాకేష్ రెడ్డి-సూర్యప్రకాష్ మధ్య మీటింగ్ లు, ఫోన్ సంభాషణలు జరిగాయి. జనవరి 30న రాకేష్ రెడ్డి-సూర్యప్రకాష్ మాట్లాడుకున్నారు. జయరాంను కారులో ఇంటికి తీసుకొస్తే అప్పు ఇస్తానని సూర్యప్రకాష్ ను రాకేష్ రెడ్డి నమ్మించాడు.
సినిమా రిలీజ్ కు డబ్బు అడ్డంకిగా మారడంతో రాకేష్ రెడ్డి చెప్పిన పనికి సూర్యప్రకాష్ ఒప్పుకున్నాడట.. స్నేహితుడు కిషోర్ తో కలిసి రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ముగ్గురు కలిసి జూబ్లిహిల్స్ క్లబ్ కు చేరుకొని జయరాంకు ఎస్ఎంఎస్ పంపి కిషోర్ తో రమ్మని చెప్పారు.
ఈ నేపథ్యంలో జయరాం రాగా.. కిషోర్ - సూర్యప్రకాష్ లు ఇద్దరూ కలిసి రాకేష్ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కిషోర్ - సూర్యప్రకాష్ ను పంపించి జయరాంను రాకేష్ రెడ్డి తన ఇంట్లో బంధించాడని సమాచారం. అనంతరం జయరాం-రాకేష్ రెడ్డి మధ్య గొడవ జరగడం.. జయరాం హత్య జరగడం చోటుచేసుకుందట.. ఈ విషయం అంతా నిందితుడు రాకేష్ రెడ్డి పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం.
ఇలా రాకేష్ రెడ్డి విసిరిన ఉచ్చులో ఆర్థిక అవసరాల కోసం నటుడు సూర్యప్రకాష్ చిక్కుకోవడం అతడి కెరీర్ ను ప్రమాదంలో పడేసింది.