Begin typing your search above and press return to search.

సంజనాతో బుమ్రా పెళ్లి సూర్యకుమార్ యాదవ్ పాత ట్వీట్ వైరల్

By:  Tupaki Desk   |   13 March 2021 1:30 AM GMT
సంజనాతో బుమ్రా పెళ్లి సూర్యకుమార్ యాదవ్ పాత ట్వీట్ వైరల్
X
టీమిండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మార్చిలోనే అతడి పెళ్లి గోవాలో జరుగబోతోంది. బుమ్రాకు కాబోయే భార్య ఎవరనే దానిపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్ల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో వివాహం జరుగబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది.

ఐపీఎల్ లో స్పోర్ట్స్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్ ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఇంగ్లండ్ తో 4వ టెస్టుకు ముందు బుమ్రా అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. పెళ్లి కుదిరిందనే వార్తలు అప్పుడే వచ్చాయి. తాజాగా అది ఖాయమైంది. దీంతో ఇంగ్లండ్ తో వన్డేలు, టీట్వంటీలకు కూడా బుమ్రా దూరం కానున్నాడు.ఈ నేపథ్యంలో సంజనా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. గతంలో ఈ బ్యూటీని ఉద్దేశించి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ట్వీట్ నెట్టింట్లో ఇప్పుడు వైరల్ గా మారింది.

బుమ్రా-సంజనా పెళ్లి నేపథ్యంలో సూర్య ట్వీట్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్పిట్ విల్లా సీజన్7తో కెరీర్ ప్రారంభించింది. ఇంజనీరింగ్ చదివిన ఈమె ఐపీఎల్, వన్డే వరల్డ్ కప్ తో సహా పలు క్రీడా ఈవెంట్లకు స్పోర్ట్ కామెంటేటర్ గా వ్యవహరించింది.ఈ క్రమంలోనే బుమ్రాతో పరిచయం ప్రేమకు దారితీసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె స్టార్ స్పోర్ట్స్ చానెల్ లో ప్రజెంటర్ గా వర్క్ చేస్తున్నారు.

కోల్ కతా నైట్ రైడర్స్ అఫిషియల్ హోస్ట్ గా చేసిన సంజన ఆ సమయంలో 2020 ఐపీఎల్ సందర్భంగా ఇక నుంచి నవ్వులేనని క్యాప్షన్ తో ఫొటో షేర్ చేసింది. దీనికి సూర్య ఈసారి తమరు ఎవరి తరుఫున ఉంటున్నారో అని కామెంట్ చేశాడు.దానికి సంజన సైతం క్రికెట్ తరుఫున ఉంటున్నా అని బదులిచ్చింది. గతంలో కేకేఆర్ కు ఆడిన సూర్యకు సంజనతో మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే వీరి ట్వీట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి.