Begin typing your search above and press return to search.

ఆ యాగాన్ని జరిపిస్తే కరోనా వ్యాధి తగ్గిపోతుందట !

By:  Tupaki Desk   |   12 April 2021 5:34 AM GMT
ఆ యాగాన్ని జరిపిస్తే కరోనా వ్యాధి తగ్గిపోతుందట !
X
దేశంలో మరోసారి కరోనా జోరు పెరిగిపోతుంది. రోజుకి లక్షకి పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాక్సిన్లు వచ్చినప్పటికి ఈ వైరస్ ను సంపూర్ణంగా తరిమికొట్టలేకపోతున్నారు. అయితే ఇలా సాంకేతిక పద్దతుల్లో కాకుండా ఆద్యాత్మిక పద్దతిలో ఈ మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యపడుతుందంటూ రాజగురు బ్రహ్మశ్రీ గురువాయూర్‌ సూర్యన్‌ నంబూద్రి స్వామి పేర్కొన్నారు. నాలుగు వేదాల్లో నిష్ణాతులైన ఈయన కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ధరణి రక్ష మహాయాగం చేయ తలపెట్టారు. అయితే అందుకు ప్రధానమంత్రి నుంచి కోట్లాది ఆస్తి కలిగిన పీఠాధిపతుల వరకు ఎవరు ఆర్థిక సాయం చేయలేదని విమర్శించారు. యాగాన్ని జరిపిస్తే కరోనా వ్యాధి తగ్గిపోతుందన్నారు.ఈ యాగం చేస్తే భారత దేశాన్నే కాదు యావత్ ప్రపంచ మానవాళిని కాపాడవచ్చని అన్నారు.

ఆరు నెలలపాటు తాను యాగాన్ని నిర్వహించాలని, తర్వాత ఆర్థిక స్థోమత లేక నిలిపివేసినట్లు తెలిపారు. సూర్యన్‌ నంబూద్రి స్వామి శనివారం సాయంత్రం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అధర్వన వేదం నడుస్తోందని, కరోనా వ్యాధి వ్యాప్తికి ఇంద్రాది దేవతల ఆగ్రహం కారణమని పేర్కొన్నారు. ఈ వ్యాధిని తగ్గించడానికి ధరణి రక్ష మహా యాగం చేస్తే ప్రపంచ జనాన్ని కాపాడవచ్చని. ఇది ఖర్చుతో కూడిన యాగం కావడంతో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా దేశంలోని పీఠాధిపతులందరికీ సాయం కోసం లేఖలు రాశారు. అయితే ఎవరు స్పందించలేదన్నారు. సంతోషాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యాగాలు చేయించే వాళ్లు దేశ ప్రజల కోసం తాను తలపెట్టిన ధరణి రక్ష యాగానికి సహకరించకపోవడం శోచనీయమన్నారు. హిందువుల పరిరక్షణ తమ ధ్యేయమని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన లేఖకు స్పందించలేదని విమర్శలు కురిపించారు.