Begin typing your search above and press return to search.

చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న బాలీవుడ్ హీరో

By:  Tupaki Desk   |   29 Jun 2018 9:15 AM
చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న బాలీవుడ్ హీరో
X
నోట్ల రద్దు పుణ్యాన ఇప్పుడు అంతా పడిపోయింది. వివిధ రంగాలపై అది చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు.. రియల్ భూమ్ కూడా పడిపోయింది.కానీ అదే సమయంలో భూముల ధరలు మాత్రం పడిపోలేదు. సంవత్సరం కింద కంటే ఇప్పుడు భూమి విలువ రెండు మూడు లక్షలు పెరిగింది. భూమిపై మనిషికి కావలసింది కూడు - గుడ్డ - నివాసం.. మొదటిరెండు ఎలాగో సంపాదిస్తున్న మనిషికి ఉండడానికి ఇల్లు మాత్రం లేదు. ఇప్పటికీ చాలా మందికి సొంత ఇళ్లు లేవు. భూముల ధరలు ఆకాశాన్నంటడం.. గుంట భూమి కూడా దొరకని పరిస్థితి నెలకొంది.

అందుకే ఈ కొరత పై కొత్తగా ఆలోచించిన లూనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ - ఓయ్ హ్యాపీ అనే కంపెనీలు భూమిపై భూముల కొరతతో చంద్రుడిపై కన్నేశాయి. చంద్రుడిపై భూముల అమ్మకానికి దిగింది. చంద్రుడిపై ఎకరా స్థలం కేవలం రూ.2300కే అమ్ముతానని ‘ఓయ్ హ్యాపీ’ అనే కంపెనీ ప్రకటించింది. చంద్రుడిపై స్థలం కావాలనుకునే వారు ఒక ఫారం నింపి ఇస్తే చాలు.. చంద్రుడిపై స్థలం వివరాలతో కూడిన ఓ సర్టిఫికెట్ ఇస్తామని ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఆరిఫ్ హుస్సేన్ పేర్కొంటున్నారు.

అయితే చంద్రుడిపై స్థలం కొన్నామని అక్కడికి వెళ్లిపోకూడదు. అది కేవలం బహుమతిగా ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుందని సదురు కంపెనీ స్పష్టం చేసింది. నిజంగా చంద్రుడి భూమిపై హక్కులు ఉండవని స్పష్టం చేసింది. రోజుకు దాదాపు 30 కొనుగోళ్లు జరుగుతున్నాయని.. వాలెంటైన్స్ డే - మదర్స్ డే వంటి రోజుల్లో ఈ కొనుగోళ్లు మరింత పెరుగుతాయని చెబుతోంది.

తాజాగా కంపెనీ ప్రకటన చూసి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొన్నట్లు ప్రకటించాడు. కేవలం రూ.2వేల ఈ స్థలం దక్కిందని సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.