Begin typing your search above and press return to search.
పక్కదేశాల వారిని కెలకాల్సిన అవసరం ఉందా?
By: Tupaki Desk | 30 Oct 2015 4:14 PM ISTప్రజలిచ్చిన అధికారాన్ని మరింత కాలం కొనసాగేలా వ్యవహరించటం తెలివైన పని. కానీ.. బీజేపీ నేతల తీరు చూస్తుంటే.. అత్యుత్సాహంతో చేతికొచ్చిన అధికారాన్ని అనవసరంగా దుర్వినియోగం చేస్తున్నారన్న బావన కలగటం ఖాయం. చేతల్లో చేసి చూపించాల్సిన విషయాల్ని అవసరానికి మించి మాటల్లో చెప్పటం ఇప్పుడు ప్రతికూలతగా మారింది.
ఇరుగుపొరుగు దేశాలతో స్నేహంగా ఉండటం.. తేడా వస్తే వారి మీద కన్నెర్ర చేయటం బాగుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా అనవసరమైన మాటలతో లేనిపోని ఉద్రిక్తతలు పెంచేలా చేయటం విమర్శలకు తావిస్తోంది. విపక్షాల మీదా.. రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకుపడటంలో అర్థం ఉంది. కానీ.. ఇరుగుపొరుగు దేశాల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటంపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ.. బీహార్ లో బీజేపీ ఓడితే పాకిస్థాన్ లో టపాకాయిలు పేల్చి దీపావళి చేసుకుంటారని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యపైనే పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. తాజాగా ప్రధాని మోడీని చూసి చైనా.. పాకిస్థాన్ లు భయపడుతున్నాయంటూ ‘అతి’విశ్వాసపు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంలో వైరిపక్షంపై విరుచుకుపడటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఇరుగుపొరుగు దేశాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబు? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.