Begin typing your search above and press return to search.
విద్యార్థుల వివాదంలోకి మరో కేంద్ర మంత్రి
By: Tupaki Desk | 27 March 2016 10:24 AM GMTయూనివర్సిటీల్లోని విద్యార్థుల వేదికగా రగులుతున్న వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదంలోకి తాజాగా కేంద్ర మాజీ మంత్రి - మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండే వచ్చారు. కేంద్ర మాజీ హోమ్ శాఖ మంత్రి - ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఏపీ గవర్నర్ గా వ్యవహరించిన షిండే విద్యార్థుల ఉద్యమంలో పాలుపంచుకునే క్రమంలో భాగంగా హైదరాబాద్ కు రానున్నారు. సహచర ఎంపీ రాజీవ్ సతావ్ తో కలిసి ఆయన హైదరబాద్ కు విచ్చేయనున్నారు.
ఆదివారం హైదరాబాద్ కు రానున్న షిండే...సోమవారం ఉదయం 11 గంటలకు చర్లపల్లి జైలు సందర్శిస్తారు.. జైలులో ఉన్న 25 మంది విద్యార్థులతో భేటీ అవుతారు. వారి అభిప్రాయాలు పంచుకొని 12 గంటలకు సెంట్రల్ కోర్టు హోటల్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో, దళిత సంఘాల నేతలతో సమావేశం అవుతారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడుతారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమర్ రెడ్డి తెలిపారు.