Begin typing your search above and press return to search.
గాలి ఇంట పెళ్లికి ఆ ఇద్దరూ రాలేదు
By: Tupaki Desk | 17 Nov 2016 7:10 AM GMTమైనింగ్ బ్యారన్ - కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. జనార్దన్ రెడ్డి కూతురు బ్రాహ్మణికి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజీవ్ రెడ్డితో బెంగళూరులో బుధవారం వివాహం జరిగింది. అక్రమ మైనింగ్ కేసులు ఎదుర్కొంటున్న జనార్దన్ రెడ్డి ఇంటి వివాహానికి హాజరు కావొద్దంటూ పార్టీ నేతలను బీజేపీ అధిష్ఠానం ఆదేశించిందని వదంతులు వచ్చాయి. అయితే, వివాహానికి హాజరయ్యే విషయంలో తమపై పార్టీనుంచి ఎటువంటి ఒత్తిడి లేదని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాకు వివరణ ఇచ్చారు. ఇదిలాఉండగా గాలి జనార్దన్ రెడ్డికి గాడ్ ఫాదర్ గా ఉన్న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. బీజేపీ అధిష్టానం వద్ద గాలికి భరోసా ఇచ్చే నాయకుల్లో సుష్మా స్వరాజ్ ముందు వరుసలో ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఆమెకు అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మరోవైపు గాలి సన్నిహితుడైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఈ వివాహానికి దూరంగా ఉన్నారు..
ఇక వివాహ మహోత్సవంతో పాటు అంతకుముందు జరిగిన కార్యక్రమానికి కూడా యడ్యూరప్ప హాజరయ్యారు. వివాహానికి వచ్చిన ప్రముఖుల్లో కేంద్రమంత్రి సదానందగౌడ ఆయన సతీమణి - కర్ణాటక గవర్నర్ విజుభాయ్ వాలా - బీజేపీ ఎంపీ శోభా - ఎమ్మెల్యే సీటీ రవి - మాజీ సీఎం జగదీశ్ షట్టర్ - మాజీమంత్రి సుబ్రమణ్యనాయుడు - బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా - ఎమ్మెల్సీ కొండయ్య - ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి - ఆరెస్సెస్ నేత ప్రభాకర్ భట్ - కాంగ్రెస్ నేత అంబరీశ్ - ఆయన సతీమణి సుమలత - మంత్రులు పరమేశ్వర - డీకే శివకుమార్ - రామలింగారెడ్డి - ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి - సినీ ప్రముఖులు జయంతి - బుల్లెట్ ప్రకాశ్ - సరోజాదేవీ - బసవరాజ్ బొమ్మై - లక్ష్మణ్ - యశ్ - పునీత్ రాజ్ కుమార్ - రవిచంద్రన్ - శరత్ బాబు - బ్రహ్మానందం - సుమన్ తల్వార్ హాజరయ్యారు. ఈ వివాహానికి 50 వేలమంది అతిథులు తరలివచ్చినట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/