Begin typing your search above and press return to search.
వారి తీరుపై మహిళా మంత్రికి కాలిపోయింది
By: Tupaki Desk | 10 July 2017 10:04 AM GMTసహజంగా సౌమ్యంగా ఉండటంతో పాటుగా అడిగిన వారికి దేశం - ప్రాంతం - కులం - మతం అనే దానితో సంబంధం లేకుండా సహాయం చేసే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తాజాగా ఉగ్రరూపం దాల్చారు. పొరుగున ఉన్న పాకిస్థాన్ పై నిప్పులు చెరిగారు. దేశద్రోహం కేసులో పాక్ మిలిటరీ కోర్టు మరణశిక్షను విధించిన కూల్ భూషన్ జాదవ్ తల్లి అవంతికా జాదవ్ కు వీసా ఇప్పించాలని స్వయంగా తానే పాకిస్థాన్ ను కోరినా ఆ దేశం మాత్రం స్పందించడం లేదు అని సుష్మా ఆరోపించారు. తన కుమారున్ని కలవాలనుకుంటున్న జాదివ్ తల్లికి పాక్ వీసా ఇవ్వకపోవడాన్ని సుష్మా తప్పుపట్టారు. అయితే ఓ పాకిస్తానీకి మాత్రం తాను మెడికల్ వీసా ఇప్పించినట్లు ఆమె చెప్పారు. ఈ విషయంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ తీరు సరిగా లేదని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు.
మెడికల్ వీసా కోరుకుంటున్న పాకిస్థానీల పట్ల తనకు సానుభూతి ఉందని, కానీ అదే విధంగా పాక్ స్పందించడం లేదని సుష్మాస్వరాజ్ అన్నారు. పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజిజ్ కు తానే వ్యక్తిగతంగా లేఖ రాశానని, కానీ ఆయన కనీసం ఆ లేఖ పట్ల స్పందన ఇవ్వలేకపోయారు అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, గత ఏడాది కుల్ భూషన్ జాదవ్ ను పాకిస్థాన్ అరెస్టు చేసి దేశద్రోహం కేసు నమోదు చేసింది. ఆయనకు మరణశిక్షను విధించి అమలు చేసేందుకు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆదివారం పాకిస్థాన్ కు చెందిన ఫైజా తన్వీర్ అనే మహిళ మెడికల్ వీసా కోరుతూ సుష్మాకు అభ్యర్థన చేశారు. దాని పట్ల కేంద్ర మంత్రి అనుకూలంగా స్పందించారు. ప్రతి ఏడాది దాదాపు 500 మంది పాకిస్తానీలు వైద్యం కోసం భారత్ వస్తున్నారు. వారికి మనదేశం అనుమతి ఇస్తూ ప్రాణాలు పోస్తోంది. కానీ జాదవ్ తల్లి పట్ల పాక్ వ్యవహరిస్తున్న తీరు అసందర్భంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సుష్మాస్వరాజ్ విలేకరుల సమావేశం నిర్వహించి పొరుగు దేశం తీరుపై మండిపడ్డారు.