Begin typing your search above and press return to search.
సుష్మా తీరే అలా ఉంటుందట
By: Tupaki Desk | 7 Aug 2015 7:19 AM GMTకాంగ్రెస్ అద్యక్షురాలు సోనియాగాంధీ మరోమారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ పై తనదైన శైలిలో మండిపడ్డారు. తనకు లలిత్ మోడీ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని , సోనియాగాందీ తన స్థానంలో ఉంటే మానవత్వం తో వ్యవహరించరా అని సుష్మా చేసిన వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. మాటలతో గారడి చేయడంలో సుష్మా స్వరాజ్ ఎక్స్‌పర్ట్ అని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
సోనియాగాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నాలుగో రోజు కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. తమపై సస్పెన్షన్ విధించడం అన్యాయమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు కక్షపూరితంగా ఉందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ....తాను సుష్మా స్థానంలో ఉండి, సహాయం కోసం సంప్రదిస్తే తప్పక తనతో అయినంత మేరకు సహకరించి ఉండేదాన్నని స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించకపోయేదానినని సోనియా వివరించారు. సుష్మా లాగా అసలే అవకతవకలకు పాల్పడకపోయేదాన్ని అని సోనియా అన్నారు.
సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపీల నిరసనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యంగ్యంగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీలలు సభకు హాజరు కావాలనుకుంటే స్పీకర్ ను సంప్రదించవచ్చని సలహా ఇచ్చారు.