Begin typing your search above and press return to search.

మనకు దెబ్బేస్తే ఎంత నష్టమో చెప్పిన సుష్మా

By:  Tupaki Desk   |   31 March 2017 4:39 AM GMT
మనకు దెబ్బేస్తే ఎంత నష్టమో చెప్పిన సుష్మా
X
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ 1 బీ వీసా కేటాయింపు విషయంలో వినిపిస్తున్న ఆంక్షలపై భారతీయుల్లో నెలకొన్న భయాందోళనల గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. హెచ్ 1బీ వీసాల్లో కోత పెడితే భారత ఐటీ నిపుణులకు నష్టం వాటిల్లుతుందన్న మాట పూర్తిగా తప్పని తేల్చారు కేంద్రవిదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. హెచ్ 1 బీ వీసాలన్నవి రెండు దేశాలకు పరస్పర ప్రయోజనాన్ని కలిగించేవిగా ఆమె ఆభివర్ణించారు. తన వాదన ఎంతమేర నిజమన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేసిన సుష్మా మాటలు వింటే నిజమనిపించక మానదు.

అమెరికా వల్ల భారత ఐటీ నిపుణులు బాగుపడుతున్నట్లుగా ఫీల్ అయ్యే వారికి.. మరింత అవగాహన కలిగిస్తూ.. మన కంపెనీల కారణంగా అమెరికన్లకు లభిస్తున్న ఉపాధి అవకాశాల గురించి వెల్లడించారు. ఉద్యోగాలే కాదు.. అమెరికా ఆర్థిక రంగానికిసాయం చేస్తున్న విషయాన్నివెల్లడించారు. అమెరికన్ల ఉద్యోగ అవకాశాల్ని భారతీయులు కొల్లగొడుతున్నారన్న వాదనలో నిజం లేదన్నఆమె.. అందుకు తగ్గట్లే తన వాదనను వినిపించారు.

భారతీయ కంపెనీలు 1.56 లక్షల మంది అమెరికన్లకు ప్రత్యక్ష ఉపాధితోపాటు.. 4.11 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తున్నట్లు చెప్పారు. 2011 నుంచి 2015 మధ్య కాలంలో భారతీయ కంపెనీలు అమెరికాలో రూ.13,200 కోట్లమేర పెట్టుబడులు పెట్టాయని.. అదే సమయంలో రూ.1.32 లక్షల కోట్ల పన్నులు చెల్లించినట్లుగా పేర్కొన్నారు. సోషల్ సెక్యూరిటీ కోసం భారతీయ ఉద్యోగులు రూ.45,500 కోట్లు చెల్లించారని.. అదే సమయంలో భారత్ లోని అమెరికన్ కంపెనీలు ఏటా రూ.1.81లక్షల కోట్లు సంపాదిస్తున్నట్లుగా వెల్లడించారు. మొత్తానికి తెల్లోళ్ల మీద భారతీయులు బతికేయటం లేదని.. ఆ మాటకొస్తే.. భారతీయ కంపెనీలు లక్షలాది తెల్లోళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించిన వైనం కనిపించకమానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/