Begin typing your search above and press return to search.
సరోగసీ బేబీకి సుష్మా స్వరాజ్ సపోర్ట్
By: Tupaki Desk | 14 Sep 2016 7:23 AM GMTసరోగసీ బిడ్డకి పాస్ పోర్టు ఇచ్చేందుకు ఆలస్యం చేస్తున్న బ్రిటన్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. సరోగసీ ద్వారా ఇండియాలో బిడ్డను కన్నారు బ్రిటిష్ దంపతులు. అయితే, ఆ బిడ్డకు పాస్ పోర్టు ఇచ్చేందుకు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడి అధికారులు. దీంతో ఈ విషయంపై సుష్మా స్వరాజ్ సీరియస్ అయ్యారు. సరోగసీ బిడ్డను అనాథను చేస్తారా - అనాథాశ్రమంలో వదిలేసి వెళ్లిపోతారా అంటూ మండిపడుతూ బ్రిటన్ ప్రభుత్వంపై ట్వీట్ చేశారు.
బిడ్డలులేని తల్లిదండ్రులు అద్దె గర్భాలను ఆశ్రయింస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మనదేశంలో సరోగసీకి సంబంధించి ఇటీవలే ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. అద్దె గర్భాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయని ఆరోపణల వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చట్టంలో పలు మార్పులు చేసి కట్టుదిట్టం చేశారు. ఈ చట్టం అమల్లోకి రాకముందే బ్రిటన్ కు చెందిన క్రిస్ - మిచేల్ హ్యమన్ దంపతులు ముంబైకి వచ్చారు. వైద్య వీసా మీద వచ్చిన వీరికి ఇండియాలో సరోగసీ ద్వారా లిల్లీ అనే బిడ్డ పుట్టింది. ఈ బిడ్డను తమ దేశానికి తీసుకెళ్లాంటే ట్రావెల్ డాక్యుమెంట్లు కావాలి. అయితే, అక్టోబర్ 7తోనే తల్లిదండ్రుల వైద్య వీసా పూర్తవుతోంది. ఈలోగా బిడ్డకి ట్రావెల్ డాక్యుమెంట్లు వచ్చే అవకాశాల్లేవని ముంబైలోని బ్రిటిష్ కాన్సులేట్ స్పష్టం చేసింది. దీంతో ఆ తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు. వీరి వీసా గడువు పూర్తయ్యేలోగా లిల్లీకి పాస్ పోర్ట్ రాకపోతే ఆ బిడ్డను ఇండియాలోనే అనాథాశ్రమంలో వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డను తమతోనే తీసుకెళ్లేందుకే ప్రయత్నిస్తున్నామనీ, లిల్లీని అనాథగా వదిలివెళ్లడం తమకు ఇష్టం లేదని ఆ దంపతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో లిల్లీ పాస్ పోర్ట్ విషయమై సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ బిడ్డను అనాథను చేయబోతున్నారా అంటూ బ్రిటిష్ అధికారులను ఘాటుగా ప్రశ్నించారు. సరోగసీ దంపతుల విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపై మండిపడ్డారు. సుష్మాజీ ట్వీట్ కి బ్రిటిష్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!