Begin typing your search above and press return to search.
అలాంటి భర్త విషయంలో సుష్మా ఏం చేయలేరట!
By: Tupaki Desk | 1 Sep 2016 9:23 AM GMTవిదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు "ఏ"సమస్య వచ్చినా నేనున్నాను, ఎవరికి ఏ సహాయం కావలన్నా నన్ను సంప్రదించొచ్చని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పిన అనంతరం ఆమెకు ఎదురవుతున్న ప్రశ్నలు కొత్త చికాకులను తెచ్చిపెడుతున్నాయి. అయినా కూడా ఏమాత్రం సహనం కోల్పోకుండా ఈ చిన్నమ్మ ఇస్తున్న సమాధానాలు కొన్ని హాస్యాన్ని పండిస్తుంటే.. మరికొన్ని ఆసక్తిని కలిగిస్తున్నాయి. దేశవేదేశాల్లోని భారత ప్రజలు తమ సమస్యలు చెప్పగానే స్పందిస్తున్న సుష్మా స్వరాజ్ కు కొంత ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో.. "నా కారు రోడ్డుపై ఆగిపోయింది - ఇప్పుడు నేనేం చేయాలి" అని ఒకవ్యక్తి సుష్మాను ట్విట్టర్ వేదికగా సహాయం కోరాడు. ఈ విషయంపై సహనంగానే స్పందించిన సుష్మా... "నాకు మెకానిక్ రాదు.. ఎవరైనా మంచి మెకానిక్ ని తెచ్చుకుని కారును బాగు చేసుకొండి" అని సమాధానం చెప్పారు. ఈ స్టైల్లో రకరకాల మనుషులు వింతైన కోరికలు కోరుతున్నా.. సుష్మా ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక మహిళ వింతైన ప్రశ్నను సందించారు.
ఆ మహిళ ట్విట్టర్ లో... తన భర్త వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని చెబుతూ ఆ వ్యవహారానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలిపి సాయం చేయాలని సుష్మాకు ట్వీట్ చేసింది. థాయ్ లాండ్ కు చెందిన ఆమె ప్రస్తుతం న్యూఢిల్లీలోనే ఉందని వివరించింది. తన తల్లి అంత్యక్రియల నిమిత్తం తాను కూడా భారత్ వచ్చానని, తన భర్త ప్రియురాలు కూడా ఇండియాలోనే ఉందనే విషయం ట్రూకాలర్ ద్వారా తెలిసిందని.. ఈ విషయంలో మీ సాయం కావాలని సుష్మా స్వరాజ్ ను కోరింది.
అయితే ఈ విషయాన్ని ఒక మహిళగా అర్ధంచేసుకున్న సుష్మా.. "సుజాత.. ఈ విషయంలో నీపై జాలి మాత్రమే చూపించగలను. విదేశాల్లో ఉండే మనవాళ్ల సమస్యలపై మాత్రమే స్పందించి సాయం చేయగలను కానీ, ఇలాంటి వంకర బుద్ది ఉన్న భర్తల విషయంలో ఎలాంటి సాయమూ చేయలేను" అని తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల సమస్యలు - పాస్ పోర్ట్ - వీసా లాంటి అధికారిక అంశాల్లో మాత్రమే తాను సహాయం చేయగలనని స్పష్టం చేస్తున్నా.. సుష్మాకి ఇలాంటి రిక్వస్ట్ లు తప్పడంలేదు!