Begin typing your search above and press return to search.

పెద్ద మ‌న‌సును చాటుకున్న కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   8 Nov 2016 9:31 AM GMT
పెద్ద మ‌న‌సును చాటుకున్న కేంద్ర మంత్రి
X
విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన రోల్ పోషించారు. పెళ్లికొడుకుది ఇండియా.. పెళ్లి కూతురుది పాకిస్థాన్‌. ఈ ఇద్ద‌రినీ క‌లిపే బాధ్య‌తను సుష్మా తీసుకున్నారు. సోమ‌వారం పెళ్లి వేడుక జ‌ర‌గాల్సి ఉండ‌టంతో స‌మ‌యానికి పెళ్లి కూతురు ఇండియా వ‌చ్చేలా అన్ని చ‌ర్య‌లు చేపట్టారు. మొత్తానికి క‌థ సుఖాంత‌మైంది. పెళ్లి కూత‌రు - క‌రాచీకి చెందిన ప్రియా బ‌చ్చానీ.. పెళ్లికొడుకు - జోధ్‌ పూర్‌ కు చెందిన న‌రేశ్ తెవానిని క‌లుసుకుంది. ఈ ఇద్ద‌రూ ఇవాళ జ‌ర‌గ‌బోయే పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు. ఈ ఇద్ద‌రికీ మూడేళ్ల కింద‌టే నిశ్చితార్థం జ‌రిగింది. న‌వంబ‌ర్ 7న పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ వ‌ధువు, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు వీసాలు ఇవ్వ‌డంలో పాకిస్థాన్‌లోని ఇండియ‌న్ ఎంబ‌సీ ఆల‌స్యం చేసింది. టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుంటంతో ఆందోళ‌న చెందిన వ‌రుడు న‌రేశ్‌.. విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్‌కి ట్వీట్ చేశాడు.

ఎప్ప‌టిలాగే ఈ స‌మస్య‌పై వేగంగా స్పందించిన సుష్మా.. వెంట‌నే వ‌ధువుతోపాటు 35 మంది బంధువుల‌కు వీసాలు జారీ అయ్యేలా చర్య‌లు తీసుకున్నారు. దీంతో ఆదివార‌మే ప్రియ‌ - ఆమె బంధువులు జోధ్‌ పూర్ చేరుకున్నారు. వీరిలో కొంద‌రు వాఘా బోర్డ‌ర్ నుంచి భార‌త్‌ లో అడుగుపెట్ట‌గా.. మ‌రికొంద‌రు థార్ ఎక్స్‌ ప్రెస్‌ లో వ‌చ్చారు. త‌మ స‌మ‌స్య‌కు వెంట‌నే స్పందించిన సుష్మా స్వరాజ్‌ కు వ‌రుడు న‌రేశ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/