Begin typing your search above and press return to search.
సరోగసీ బిల్లు.. సెలబ్రెటీలకు షాకే
By: Tupaki Desk | 24 Aug 2016 4:22 PM GMTసరోగసీ.. తెలుగులో చెప్పాలంటే.. అద్దె గర్భం. కొన్నేళ్లుగా బాగా చర్చనీయాంశం అవుతున్న విధానం. గర్భం దాల్చే విషయంలో సమస్యలున్న వారికి వరంలా మారింది ఈ విధానం. ఐతే సెలబ్రెటీలు మాత్రం దీన్ని మరో రకంగా ఉపయోగించుకుంటున్నారు. గర్భం దాల్చడానికి ఏ సమస్యా లేకున్నా.. ఆ భారం మోయడానికి ఇష్టం లేక.. డబ్బాశ చూపించే వేరే వాళ్లతో బిడ్డల్ని మోయిస్తున్నారు. కనిపిస్తున్నారు. షారుఖ్ ఖాన్.. అమీర్ ఖాన్.. తుషార్ కపూర్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ విధానంలోనే పిల్లల్ని కన్నారు. ఐతే ఇలాంటి వాళ్లకు షాకిస్తూ సరోగసీపై కొన్ని నిబంధనలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం.
బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన సరోగసీ బిల్లు చట్టరూపం దాలిస్తే.. పిల్లలు లేని దంపతులు తమకు సంబంధం లేని కొత్త మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కుదరదు. ఇందుకోసం వారు తమ బంధువుల.., లేదా తెలిసిన వారి సహాయం మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది. సరోగసీ ఓ వ్యాపారంలాగా మారిపోతున్న నేపథ్యంలో ఈ మేరకు నిబంధనలు తెస్తున్నట్లు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. కొత్త సరోగసీ బిల్లు ప్రకారం విదేశీయులు.. ప్రవాస భారతీయులు.. సింగల్ పెరెంట్.. సహజీవనం చేసే దంపతులు.. స్వలింగ సంపర్కులు సరోగసీ విధానం ద్వారా పిల్లలు పొందడానికి ఇకమీదట అనుమతించబోరు. సెలబ్రిటీలకు సైతం నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త బిల్లు సెలబ్రెటీలకు షాకే అని చెప్పాలి.