Begin typing your search above and press return to search.
ట్రంప్ కారణంగానే మనోళ్ల మీద దాడి చేస్తున్నారట
By: Tupaki Desk | 5 March 2017 10:13 AM GMTఇటీవల కాలంలో టార్గెట్ చేసి మరీ.. భారతీయుల మీద జరుగుతున్న వైనం తెలిసిందే. మొన్నటికి మొన్న తెలుగువాడైన శ్రీనివాస్ కూఛిబొట్ల శ్రీనివాస్ ను దారుణంగా కాల్చి చంపిన వైనాన్ని మర్చిపోక ముందే.. నీ దేశానికి వెళ్లిపో.. అంటూ సిక్కు యువకుడు దీప్ రాయ్ పై అమెరికన్ శ్వేతజాతీయుడు ఒకరు తాజాగా కాల్పులు జరిపిన వైనంపై.. ఆయన తండ్రి సర్దార్ హర్ పాల్ సింగ్ రియాక్ట్ అయ్యారు.
భారతీయులపై జరుగుతున్న దాడులు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటల కారణంగానే జరుగుతున్నాయంటూ ఆరోపించారు దీప్ రాయ్ తండ్రి. ట్రంప్ విద్వేషపూరిత మాటలతోనే.. అమెరికన్లు భారతీయులపై దాడికి పాల్పడుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు ఆసుపత్రితో కోలుకుంటున్నారని.. ప్రాణాపాయం తప్పినట్లుగా వైద్యులు వెల్లడించినట్లు చెప్పారు.
తనకొడుకు మీద దాడి జరిగిన నేపథ్యంలో కేంద్రవిదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తమతో మాట్లాడినట్లుగా ఆయన వెల్లడించారు. దీప్ రాయ్ త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షను సుష్మా స్వరాజ్ వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కూఛిబొట్ల తర్వాత.. భారత సంతతికి చెందిన హర్నీష్ పటేల్ ను కాల్చి చంపిన వైనం తెలిసిందే. హర్నీష్ కుటుంబంతో సుష్మాస్వరాజ్ మాట్లాడి..వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/