Begin typing your search above and press return to search.
హెచ్1బీ వీసా...సుష్మ ధైర్యవచనాలు
By: Tupaki Desk | 28 July 2018 8:45 AM GMTసోషల్ మీడియాలో చురుకుగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసే విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోమారు ఎన్నారైలు - వారి కుటుంబ సభ్యుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అమెరికాలో ఉద్యోగాలకు సంబంధించి ఐటి ఉద్యోగులు ఎలాంటి భయాలు పెట్టుకోనక్కరలేదని హామీ ఇచ్చారు. ఉద్యోగాలలో కోత పెట్టే విషయంలో అమెరికా ప్రభుత్వం ఇంకా ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని, భారత ఐటీ ఆందోళనల విషయంలో ట్రంప్ యంత్రాంగంతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని సుష్మా అన్నారు. వచ్చే సెప్టెంబర్ 6వ తేదీన అమెరికా-భారత్ మధ్య కీలకమైన అధికారుల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు.
అమెరికా ప్రభుత్వ కార్యదర్శి మైక్ పాంపియో - రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ ఈ ద్వైపాక్షిక చర్చలకు హాజరుకానున్నారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ - రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్ భారత తరఫున పాల్గొననున్నారు. ఈ సమావేశం గురించి, వివిధ వీసాల నిబంధనల గురించి తాజాగా సుష్మాస్వరాజ్ రాజ్యసభలో వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం - కాంగ్రెస్ సభ్యులతో మన అధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని, భారత ఐటి కంపెనీలు - అమెరికాకు పరస్పర లాభం కలిగేవిధంగా నిర్ణయాలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తెలిపారు. రాబోయే సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నట్లు వివరించారు. అమెరికా అర్థిక వ్యవస్థలో భారత కంపెనీలు కీలక భూమికను నిర్వహిస్తున్నాయని, గత అయిదేళ్లలో భారీగా పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు.
ఉద్యోగాలు పోతాయనే భయం, అనిశ్చిత వాతావరణం నెలకొందని తానూ అంగీకరిస్తున్నానని సుష్మ తెలిపారు. ``అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేదు. వీసా ఆంక్షలకు సంబంధించి కాంగ్రెస్ లో పలు బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ ఏ బిల్లు కూడా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు.’’ అని ఆమె అన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు పోవటం కానీ, అందుకు అనుకూలమైన బిల్లు పాస్ కావటం కానీ జరగలేదని స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్ పై - వీసాపై - ఇమ్మిగ్రేషన్ పై బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సుష్మా సభకు వివరించారు. ఈ ‘‘మేం కేవలం నామమాత్రంగా చర్చలు జరపటం లేదు. మన పక్షాన సమర్థమైన వాదనలు గణాంకాలతో సహా అందిస్తున్నాం. హెచ్1బి వీసాదారుల ఉద్యోగాల ఎందుకు పరిరక్షించాలన్న అంశంపై హేతుబద్ధమైన కారణాలను అందిస్తున్నాం’’ అని సుష్మా ధైర్యవచనాలు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి వీసాల జారీపై ట్రంప్ సర్కారు కఠినమైన నిబంధన తెరమీదకు తెచ్చింది. దీంతోపాటుగా ఉద్యోగిని థర్డ్ పార్టీగా పేర్కొంది. ఈ నేపథ్యంలో టెకీలలో ఆందోళన మొదలైంది. కాగా, 2014లో 10800 హెచ్1బీ వీసాలు జారీకాగా - 2018లో 1,29,000 వీసాలు కేటాయించారు. దీంతో ఈ వీసాలపై అమెరికా కన్నేసి నిబందనలు కఠినం చేసింది.