Begin typing your search above and press return to search.
ఎయిర్ ఇండియా విమానంలో ఆ పాడు పని చేసిన నిందితుడు అరెస్ట్!
By: Tupaki Desk | 7 Jan 2023 6:30 AM GMTఎయిరిండియా విమానంలో ఒక వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు తాజాగా బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. వృద్ధ మహిళపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి ఎయిరిండియా ఫిర్యాదు మేరకు అతడిపై ఢిల్లీలో కేసు నమోదైన విషయ తెలిసిందే.
కాగా ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే...2022 నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఈ అమానుషం చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనలో బాధిత వృద్ధ మహిళ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది.
తనపై నిందితుడు శంకర్ మిశ్రా మూత్ర విసర్జన చేసిన ఘటన గురించి ఎయిరిండియా సిబ్బందికి చెప్పినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వృద్ధ మహిళ ఆరోపించింది. దీంతో ఎయిరిండియాపై నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో నిందితుడు శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా విమాన ప్రయాణాలపై 30 రోజుల వరకు నిషేధం విధించింది. మరోవైపు, ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి ఆచూకీ పోలీసులకు లభించలేదు. ముంబయిలోని అతడి ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. అయితే తాళం వేసి ఉండటంతో తిరిగి వచ్చేశారు.
ఇక చివరకు శంకర్ మిశ్రా ఆచూకీ కనిపెట్టడానికి ఢిల్లీ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే అతడు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి శంకర్‌ను అరెస్టు చేశారు. ఘటన జరిగిన నాటి నుంచి శంకర్ మిశ్రా ఫోన్ స్విచాఫ్ చేశాడు. అయితు సోషల్ మీడియా, క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నాడు. వారి ఆధారంగానే అతడి ఆచూకీ గుర్తించగలిగామని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా ఈ వివాదంపై స్పందించాడు. బాధితురాలికి తగిన నష్టపరిహారం చెల్లించానని, వివాదం అక్కడితో సమసిపోయిందని తెలిపాడు. అయితే తాను నష్టపరిహారం చెల్లించిన నెల రోజుల తర్వాత బాధితురాలి కుమార్తె ఆ డబ్బును తనకు తిరిగి పంపించేశారని వివరించాడు. ఈ మేరకు మిశ్రా తరపు న్యాయవాదులు ఓ ప్రకటనను విడుదల చేయడం గమనార్హం.
బాధితురాలి పాడైపోయిన బ్యాగ్, దుస్తులను మిశ్రాకు పంపారని, ఆయన వాటిని ఉతికించి నవంబరు 30నే ఆవిడకు అందజేశారని శంకర్ మిశ్రా న్యాయవాదులు తెలిపారు.
కాగా నిందితుడు శంకర్ మిశ్రా.. అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తుండటం గమనార్హం. ఈ ఘటన నేపథ్యంలో శంకర్ మిశ్రాను ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించి అతడికి షాక్ ఇచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.