Begin typing your search above and press return to search.
డెహ్రాడూన్ రోడ్ల మీద 7గురు ఉగ్రవాదులు?
By: Tupaki Desk | 27 Jan 2016 7:11 AM GMTఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా ఏడుగురు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న యువకులు తాపీగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని ఒక వీధి వెంట భుజానికి బ్యాగులు తగిలించుకున్న ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న యువకులు నడిచి వెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమేరాలో రికార్డు అయ్యాయి. ముఖాలకు ముసుగు ధరించి.. వీపులకు బ్యాగులు తగిలించుకు వెళుతున్న వారు డెహ్రాడూన్ లోని ఒక వీధిలో కనిపించారు.
ఈ దృశ్యాల్ని చూసిన పోలీసులు రాష్ట్రంలో హైఅలెర్ట్ ప్రకటించారు. వాట్సప్ లాంటి సోషల్ నెట్ వర్క్స్ లో ఈ వీడియోను ఉంచిన ఉత్తరాఖండ్ పోలీసులు విడుదల చేసి.. ఆ ఏడుగురు యువకుల్ని మీరేమైనా చూశారా? అని ప్రశ్నిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్న వ్యూహాన్ని భగ్నం చేసి.. పలువురిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఈ ఏడుగురు యువకుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న ఈ ఏడుగురు ఎవరన్నది ఇప్పడు అంతుచిక్కటం లేదు.