Begin typing your search above and press return to search.
ఐసిస్ మనల్ని ఇలా భయపెట్టేస్తోంది
By: Tupaki Desk | 23 Oct 2017 7:29 AM GMTఇస్లామిక్ స్టేట్ నుంచి మరో కలకలం తెరమీదకు వచ్చింది. ఈ దఫా భారత్ ను నేరుగా ఈ రాక్షసమూక టార్గెట్ చేసిందని అంచనాలు వస్తున్నాయి. భారతీయ వైద్యుడు ఒకరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడని భారత నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) విడుదల చేసిన వీడియో ఫుటేజ్ లో కనిపిస్తోంది అనుమానిత భారతీయ వైద్యుడే అన్నది భారతీయ నిఘా సంస్థల అంచనా. 15 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి - ఐఎస్ లో చేరమంటూ యువతకు సందేశమిచ్చాడు. భారత్‌ను కలవరపాటుకు గురిచేసేందుకు ఈ వీడియోను వెలువరించినట్లు చెప్తున్నారు.
భారతీయ నిఘావర్గాల అభిప్రాయం ప్రకారం...ఈ వీడియోలో కనపడ్డ వ్యక్తి పేరు `డాక్టర్ అబు అల్ ముకాతిల్`గా చూపించారు. అయితే ఇది అతని 'కోడ్ నేమ్' అయివుంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో ఫుటేజ్ భారతీయ నిఘా వర్గాలకు పెద్ద సవాల్ గా మారింది. ఇందులో కనిపిస్తున్నది ఓ భారతీయ వైద్యుడేనని కచ్చితంగా తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ వీడియోను సవాల్‌గా తీసుకున్న వివిధ దేశాల నిఘా ఏజెన్సీలు ఇప్పటికే విచారణను ప్రారంభించాయి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా భారత నిఘా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయమై గతకొద్ది కాలంలో అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
కాగా ఐసిస్ విడుదల చేసిన వీడియోలో అబు అల్ ముకాతిల్ ఏమన్నాడంటే...``రక్కా హాస్పిటల్ లోని ఫిజియోథెరపీ సెంటర్ లో వివిధ దేశాల డాక్టర్లు పనిచేస్తున్నారు. మహిళలు - పిల్లల కోసం ప్రత్యేక బృందం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు సిరియా వచ్చి ఐఎస్ లో చేరాలని కోరుతున్నాం. ఇక్కడ తమ వైద్య సేవల్ని అందించాల్సిందిగా కోరుతున్నాం.`` అని తెలిపాడు. భారత్ నుంచి తమకు దక్కుతున్న మద్దతుకు ఇది నిదర్శనమని ఐసిస్ చెప్పింది.