Begin typing your search above and press return to search.

ప్రభుత్వ రహస్యాల్ని పాక్ కు ఇస్తున్న వారంతా..?

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:19 AM GMT
ప్రభుత్వ రహస్యాల్ని పాక్ కు ఇస్తున్న వారంతా..?
X
దేశానికి ద్రోహం చేసే పనుల గురించి గొంతెత్తటం తప్పు అయితే.. ఈ వార్త కూడా తప్పే అవుతుంది. దేశ సంక్షేమం కోసం కొన్ని చేదు నిజాల్ని బయటకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని పరిశీలిస్తే.. కనిపించే ఒక నగ్నసత్యమిది. తాజాగా భారత్ లో ఉగ్రకలకలం రేపేందుకు పాక్ ఎన్నో పన్నాగాలకు పాల్పడుతున్న విషయం అందరికి తెలిసిందే. తాము భారత్ లో చేపట్టాల్సిన ఉగ్ర చర్యలకు పరోక్షంగా సాయం చేయటం కొత్తేం కాదు. కానీ.. ఈ దుశ్చర్యలకు సహకరించే వారినిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ.. కోల్ కతాలలో వేర్వేరుగా పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అనుమానితులంగా ఒకే వర్గానికి చెందిన వారు కావటం గమనార్హం.

భారత సైతిక రహస్యాల్ని పాక్ కు చేరవేసే రాకెట్ లో ఇద్దరిని ఢిల్లీ పోలీసులు జమ్మూ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు. కొంతకాలంగా భారత సైనిక రహస్యాల్ని పాక్ కు చేరవేస్తున్న సంగతిని నిఘా సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. బీఎస్ ఎఫ్ నిఘా విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న అబ్దుల్ రషీద్.. కఫియతుల్లా ఖాన్ అనే ఐఎస్ ఏజెంట్ కు రహస్యాలు అందిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి ఆర్మీకి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు కోల్ కతాలో ముగ్గురు ఐఎస్ ఏజెంట్లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఇర్షాద్ అన్సారీ (51).. అసఫ్ అన్సారీ (23).. వీరి బంధువు జహంగీర్ లు ఉండటం గమనార్హాం. ఇక్కడ కీలకాంశం ఏమిటంటే.. ఉగ్రచర్యలకు సాయం అందించే పని చేస్తున్న వారంతా ఒకే వర్గానికి చెందిన వారు మాత్రమే కాదు.. 51ఏళ్ల వ్యక్తి ఉండటం గమనార్హం. వీరంతా కోల్ కతాలో నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. భారత లో తీవ్రవాద కార్యకలాపాల కోసం పాక్ ఎరకు చిక్కుకునే వారంతా ఒకే వర్గానికి చెందిన వారు కావటం కాస్తంత ఆందోళన కలిగించటంతోపాటు.. మరింత దృష్టి సారించే అంశంగా మారిందని మర్చిపోకూడదు.