Begin typing your search above and press return to search.

ఫోర్జరీ కేసులో సస్పెండెడ్ మేజిస్ట్రేట్‌ రామకృష్ణ అరెస్ట్ .. ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   12 Dec 2020 6:01 AM GMT
ఫోర్జరీ కేసులో సస్పెండెడ్ మేజిస్ట్రేట్‌ రామకృష్ణ అరెస్ట్ .. ఏంచేశారంటే ?
X
చిత్తూరు జిల్లాలో పలు వివాదాస్పద అంశాలలో ఇరుక్కొని సస్పెండ్ అయిన మేజిస్ట్రేట్ రామకృష్ణ‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. చనిపోయిన పినతల్లి చెక్కులపై సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్న సస్పెండెడ్‌ మెజిస్ట్రేట్‌ రామకృష్ణ, ఆయన తనయుడు వంశీకృష్ణను మదనపల్లె టూటౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ఈ ఘటన పై పూర్తి వివారాల్లోకి వెళ్తే .... బి.కొత్తకోటకు చెందిన సస్పెండెడ్‌ మెజిస్ట్రేట్‌ రామకృష్ణకు పినతల్లి అయిన సుచరిత గతేడాది మరణించారు. ఆమెకు సంబంధించిన కెనరా బ్యాంక్‌ చెక్కులను ఫోర్జరీ సంతకాలతో రామకృష్ణ, వంశీకృష్ణలు డ్రా చేసుకోవడం మొదలుపెట్టారని , ఆ విషయాన్ని గుర్తించిన సుచరిత కుటుంబసభ్యులు బి.కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారట, ఎస్‌ ఐ సునీల్‌ కుమార్ ఈ విషయమై‌ కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ ను విచారించగా, ఫోర్జరీ సంతకాలతో చెక్కులు డ్రా చేసింది వాస్తవమేనని తేలిందట. దీనితో బ్యాంక్‌ మేనేజర్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారట.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం హార్సిలీహిల్స్‌ వద్ద ఉన్న రామకృష్ణ, వంశీకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరచగా ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారని డీఎస్పీ మనోహరాచారి తెలిపారు. కాగా, మేజిస్ట్రేట్ రామకృష్ణ చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వివాదాస్పదంగా మారారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు, రామకృష్ణకు మధ్య వివాదం రగులుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే తనపై దాడి చేశారని అప్పట్లో రామకృష్ణ ఆరోపించారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, దళిత సంఘాలు ఖండించాయి. ఈ నేపథ్యంలోనే జడ్జి రామకృష్ణ రోడ్డుపైకి రావొద్దంటూ తహసీల్దార్ నిషేదాజ్ఞలు విధించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.