Begin typing your search above and press return to search.
కోమటి రెడ్డి - సంపత్ ల సస్పెన్షన్ పై సస్పెన్స్!
By: Tupaki Desk | 8 Aug 2018 11:19 AM GMTకొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను టీఆర్ ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ తీరును తప్పుబడుతూ వారిద్దరూ కోర్టును ఆశ్రయించారు. దీంతో, ఆ ఇద్దరిని శాసనసభలోకి అనుమతించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్తర్వులు చూపించినా తమను శాసన సభలోకి అనుమతించడం లేదంటూ కోమటి రెడ్డి - సంపత్ కుమార్ లు ....తెలంగాణ సర్కార్ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో,తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావును హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
హైకోర్టు సింగిల్ జడ్చి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ....డివిజనల్ బెంచ్ విచారణ జరపాలంటూ ప్రభుత్వం తరఫున తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు...ఆగస్టు 16కు విచారణ వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో, కోమటి రెడ్డి - సంపత్ లు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు మరింత సమయం పట్టేట్లు కనిపిస్తోంది. వారి రీఎంట్రీపై సస్పెన్స్ ను తెలంగాణ సర్కార్ కొనసాగిస్తోంది. అయితే, ఈ పిటిషన్ విచారణ జరిపిన తర్వాత డివిజన్ బెంచ్ కూడా కోమటి రెడ్డి - సంపత్ లకు అనుకూలంగా తీర్పునిస్తే....అది తెలంగాణ సర్కార్ కు ఎదురు దెబ్బ అవుతుంది. అందుకోసం...ఈ వ్యవహారంలో సాధ్యమైనంత జాప్యం జరిగేలా తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పిటిషన్ ల విచారణ పూర్తయి....తీర్పు వచ్చేసరికి....అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోతాయని....దీంతో, వారు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉండదని కేసీఆర్ యోచిస్తున్నట్లు కనిపిస్తోంది.