Begin typing your search above and press return to search.

విడాకులు తీసుకున్నా రోజూ ఛాటింగ్

By:  Tupaki Desk   |   13 Jun 2016 3:30 PM GMT
విడాకులు తీసుకున్నా రోజూ ఛాటింగ్
X
కొన్ని జంటలు చూడ ముచ్చటగా ఉంటాయి. వాళ్లను చూస్తే ఈడుజోడు అన్న మాటకు నిలువెత్తు అర్థంలా కనిపిస్తారు. అలాంటి జంటలు కాస్త అరుదుగానే కనిపిస్తాయి. ఇక.. బాలీవుడ్ లో అలాంటి జంటలు చాలా.. చాలా తక్కువ. ఆ అబ్బాయి అమ్మాయిల కలల రాకుమారుడు. ఇక.. ఆ అమ్మాయి ప్రతి యువకుడి స్వప్న సుందరి. మరి.. అలాంటి ఇద్దరు జంట అయితే.. ఎంత ముచ్చటగా ఉంటుంది.బాలీవుడ్ హీమ్యాన్ హృతిక్ రోషన్ ఒక ఇంటి వాడైనప్పుడు.. అతడి భార్య సుసాన్నే ఖాన్ ను చూసినోళ్లంతా ఇదే అనుకున్నారు.

వీరి జంట ఎంత ముచ్చటగా ఉన్నా.. వీరి మధ్య పెళ్లి బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోవటం తెలిసిందే. కొన్నేళ్ల కిందట వీరిద్దరూ విడాకులు తీసుకొని ఎవరి దారి వారు వెళ్లిపోయిన తర్వాత.. ఒకరి గురించి ఒకరు పెద్దగా చెప్పుకున్నది లేదు. అలాంటిది తాజాగా హృతిక్ మాజీ భార్య సుసాన్నే ఖాన్ ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. తామిద్దరం విడిపోయినప్పటికీ రోజూ చాటింగ్ చేసుకుంటామని చెప్పుకొచ్చింది.

తామిద్దరం ఒక స్థాయిని చూశామని.. ఆ స్థాయి దాటిన తర్వాత కలిసి ఉండకపోవటమే తమిద్దరికి మంచిదనిపించిందని చెప్పింది. తమను తాము మభ్య పెట్టుకుంటూ తప్పుడు బంధంలో కలిసి ఉండటం కంటే దూరంగా ఉండటం మంచిదనిపించిందని.. అందుకే విడిపోయినట్లుగా పేర్కొంది. విడిపోయినా పిల్లల విషయంలో తామిద్దరం కమిట్ మెంట్ తో ఉన్నట్లుగా చెప్పిన ఆమె.. ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉంటూ సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొంది. పిల్లల కోసం మరింత బాధ్యతగా ఉన్నప్పుడు.. ఇద్దరిని దూరం చేసే అంశాల విషయంలో మరికాస్త జాగ్రత్తగా ఉంటే.. విడిపోవాల్సిన అవసరమే కాదు.. పిల్లలకు అలాంటి లోటు లేకుండా ఉండేది కదా. విడిపోయిన తర్వాత కూడా రోజూ చాటింగ్ చేసుకునే మంచి వాతావరణం ఉన్నప్పుడు.. విడిపోవటానికి దారి తీసే మార్గాల్ని మూసేస్తే సరిపోయేదేమో..?