Begin typing your search above and press return to search.

మాజీ డ్రైవర్ కి దేశ అధ్యక్ష పదవికి నామినేషన్

By:  Tupaki Desk   |   10 March 2016 7:38 AM GMT
మాజీ డ్రైవర్ కి దేశ అధ్యక్ష పదవికి నామినేషన్
X
ప్రపంచవ్యాప్తంగా పరపతి ఉన్న అతికొద్ది మంది నేతల్లో మయన్మార్ కు చెందిన ఆంగ్ సాన్ సూకీ ఒకరు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి అయిన ఆమె తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఏళ్ల తరబడి సైనిక పాలనలో మగ్గి.. సూకీ పోరాటం తర్వాత ఈమధ్యనే ఎన్నికలు నిర్వహించటం.. సూకీ నేతృత్వంలోని పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయటం తెలిసిందే.

ఇదిలా ఉండగా దేశ అధ్యక్ష పదవికి సూకీ తీసుకున్న నిర్ణయం ఇప్పడు సంచలనంగా మారింది. తనకు అత్యంత నమ్మకస్తుడైన మాజీ డ్రైవర్.. తాను నడిపే స్వచ్ఛంద సంస్థలో పని చేసే యుతిన్ క్యావ్ ను అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మయన్మార్ చట్టాల ప్రకారం.. సూకీ అధ్యక్ష పదవిని చేపట్టే వీల్లేదు. దీంతో.. ఆ చట్టాన్ని మార్చాలంటే మొదటఎవరో ఒకరు డమ్మీ అభ్యర్థి దేశాధినేత కావాలి. అనంతరం.. చట్టానికి మార్పులు చేయటం ద్వారా దేశాధినేతగా మారాలన్నది సూకీ వ్యూహంగా చెబుతున్నారు.

అయితే.. దేశాధినేత పదవికి పార్టీలో ఎవరూ లేనట్లు.. తన మాజీ డ్రైవర్ ను నామినేట్ చేయటం చూసినప్పుడు.. తన పార్టీకి చెందిన వారిని ఎవరి పట్ల ఆమెకు నమ్మకం లేదా? అన్న సందేహం కలగక మానదు.