Begin typing your search above and press return to search.
కేసీఆర్ మీద అగ్నివేశ్ విమర్శల నిప్పులు
By: Tupaki Desk | 7 April 2016 6:11 AM GMTతెలంగాణ ఉద్యమ సమయంలో జాతీయస్థాయి నేతలు.. ఉద్యమకారులు కొందరు ఆయనకు దన్నుగా నిలిచారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ సామాజికవేత్త.. ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తరఫున ఎన్నికల సమయంలో ప్రచారం చేసేందుకు ఆయన తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే వారు. అలాంటి ఆయన.. తాజాగా కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలకు.. ప్రస్తుతం ఆయన చేతలకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన తేల్చి చెబుతున్నారు. ఇసుక.. అటవీ మాఫియాలకు అడ్డుకట్ట వేయాలని తాను గతంలో కోరానని.. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటివేదీ చోటు చేసుకోలేదని.. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయంలో ఆయన వ్యాఖ్యానించారు.
బీహార్ లో మాదిరి తెలంగాణ రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్.. మద్యం మీద బతికేస్తున్న తెలంగాణ.. ఏపీ రాష్ట్రాలు ఇప్పుడిక ఈ రెండింటి మీద ఆదాయం కోత వేసుకోమంటే సాధ్యం కాదనే చెప్పాలి. ఉద్యమ సమయంలో మిత్రుడిగా వ్యవహరించిన నేత నోటి నుంచి నిప్పులు చెరిగేలా వ్యాఖ్యలు చూసినప్పుడు.. కేసీఆర్ పాలన మీద పలు సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తుందని చెప్పక తప్పదు.