Begin typing your search above and press return to search.
రాష్ర్టపతిని యాగానికి వెళ్లొద్దని బహిరంగ లేఖలు
By: Tupaki Desk | 28 Dec 2015 5:57 AM GMTతెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అయుత చండీయాగానికి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథి. యాగం పూర్తయ్యే చివరి రోజున పూర్ణాహుతి కార్యక్రమం రాష్ర్టపతి ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు నిప్పు అంటుకొని యాగశాల దగ్దం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉన్న రాష్ర్టపతి తన ప్రత్యేక హెలీకాప్టర్ లో అక్కడికి చేరుకున్నప్పటికీ...యాగశాల దగ్దం అవుతున్న సమయంలో ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న రాష్ర్టపతి అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చారు. ఇవన్నీ మనకు తెలిసినవే అయినప్పటికీ రాష్ర్టపతి యాగానికి హాజరయ్యే విషయంలో మరో ఆసక్తికర సమాచారం వచ్చింది.
అయుత చండీయాగానికి వెళ్లవద్దని స్వామి అగ్నివేశ్ రాష్ర్టపతిని కోరారు. సామాజిక వేత్త - తార్కికవాది అయిన స్వామి ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీకి బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. " చండీయాగం వంటివన్నీ లాజికల్ గా నిరూపితం అయినవి కావు. అలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల అద్భుతాలు జరుగుతాయనే ప్రచారం జనంలోకి వెళుతుంది. రాజ్యాంగ పెద్ద అయిన మీరు ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు"అని కోరారు. అంతేకాకుండా....'ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత చేసిన మొదటి ప్రసంగంలోనూ తార్కికవాదాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఈ విషయాలన్ని పరిగణనలోకి తీసుకోవాలి' అని అగ్నివేశ్ కోరారు.
అయితే అగ్నివేశ్ లేఖ విషయం అలా ఉంచి రాష్ర్టపతి కార్యక్రమానికి వెళ్లడం, ఆ కార్యక్రమంలో హాజరుకాకుండా వచ్చిన విషయం తెలిసిందే.