Begin typing your search above and press return to search.
అగ్నివేశ్ ప్రచారం కోసమే కొట్టించుకున్నారా?
By: Tupaki Desk | 19 July 2018 8:39 AM GMT78 ఏళ్ల వయసులో బోలెడంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత కూడా అవమానకరంగా వీధుల్లో పడేసి తన్నులు తినేలా ప్లాన్ చేసుకునే వారు ఎవరైనా ఉంటారా? ఒకవేళ కరుడుగట్టిన రాజకీయ నేత అయితే ఏమో అనుకోవచ్చు. కానీ.. ఒక సామాజికవేత్తకు ఇలాంటి దరిద్రపుగొట్టు ప్లాన్లు వేసుకునే ఛాన్స్ ఉందా? అంటే.. లేదంటే లేదన్న మాటనే చెబుతారు. కానీ.. ఇలాంటివేవీ బీజేపీ నేతలకు పట్టటం లేదు.
దుర్మార్గంగా సాగిన అగ్నివేశ్ పై దాడి ఘటనపై వక్రభాష్యం పలుకుతున్నారు బీజేపీ నేతలు. పాపులార్టీ కోసమే అగ్నివేష్ తనపై తానే దాడి చేయించుకున్నారని చెబుతున్నారు. ఈ మాటలు అన్నదో ముక్కు ముఖం పెద్దగా తెలీని నేతలైతే ఒక పద్ధతి. కానీ.. ఆ మాటలు అన్నది జార్ఖండ్ మంత్రి సీపీ సింగ్. అగ్నివేశ్ పై కాషాయదళం చేసిన దాడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారని చెప్పాలి.
ఈ వ్యవహారంపై ఎదురుదాడికి దిగిన బీజేపీ నేతలు ఎలాంటి లాజిక్కులు లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడటంపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అగ్నివేశ్‌ను ఒక మోసగాడని.. హిందువులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారని.. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కశ్మీర్ వేర్పాటువాదులు.. ఉగ్రవాదులకు ఆయన మద్దతు ఇస్తుంటారన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు అగ్నివేశ్‌కు మామూలేనని.. ఆయనపై మనసులో కోపాన్ని పెట్టుకొనే ఎవరైనా అలా చేసి ఉండొచ్చని మరో బీజేపీ నేత వ్యాఖ్యానించటం గమనార్హం. సీపీ సింగ్ వింత భాష్యంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అగ్నివేశ్ పై దాడి ఘటనను రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలు ఖండిస్తూ అగ్నివేశ్‌కు సంఘీభావాన్ని తెలుపుతున్నారు. దాడి జరిగిన తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు మరింత ఎక్కువయ్యేలా జార్ఖండ్ బీజేపీ నేతల మాటలున్నట్లుగా చెబుతున్నారు.